డబ్బు సంపాదించడం వేరు. దనవంతుడిగా బతకాలనుకోవడం వేరు. చాలామంది డబ్బు సంపాదిస్తారు. కానీ కొందరే ధనవంతుడిగా బతుకుతారు. ధనవంతుడిగా మారడానికి ముందుగా మీ ఆలోచనలని మార్చుకోవాలి. ఏ విధంగా ఆలోచిస్తే ధనవంతుడిగా మారవచ్చో ఇక్కడ తెలుసుకుందాం.
నీ సమయానికి విలువ ఇవ్వు. డబ్బు సంపాదించడానికి నీ దగ్గర ఏమి ఉన్నా లేకపోయినా సమయం మాత్రం ఉండాలి. అందుకే సమయాన్ని వృధా చేయకు. నీ సమయాన్ని వృధా చేసే వాళ్ళ నుండి దూరంగా ఉండు.
డబ్బు ఎక్కువగా సంపాదించాలంటే ఒకే దగ్గర కూడబెట్టకూడదు. నువ్వు సంపాదించిన డబ్బు మళ్ళీ డబ్బు సంపాదించేలా చూసుకోవాలి. ఒకే చోట పెట్టడం వల్ల ఏమీ రాదు అని తెలుసుకోండి.
నీకు అవసరం లేని వాటిని కొనవద్దు. ఉన్నంతలో నీక్కావాల్సిన సౌకర్యాలని సమకూర్చుకో. లక్సరీలకి పోయి ఎక్కువ ఖర్చు చేయవద్దు. అది మిమ్మల్ని ధనవంతులుగా మారే దారి నుండి తప్పిస్తుంది.
గొప్పగా ఆలోచించు. నీ వల్ల అవుతుందా కాదా అన్నది పక్కన పెడితే కనీసం ఆలోచనలైనా గొప్పగా ఉండాలి. ఆ తర్వాత నీవల్ల ఎందుకు కాదో పునరాలోచించుకో. అంతే కానీ, ఆలోచనకే భయపడిపోతే ఎప్పటికీ దూరం చేరుకోలేవు. ధనవంతుడిగా మారలేవు.
నీ చుట్టూ ఉన్నవారు నీకు ఆనందం, జ్ఞానం ఇచ్చేలా ఉండాలి. గప్పాలు కొడుతూ నిన్ని పొగుడుతూ అక్కడే ఉంచేవాళ్ళు కాదు. వాళ్ళు కంఫర్ట్ జోన్ లో ఉండి నిన్ను కూడా అందులోనే ఉంచాలని చూసేవాళ్లతో స్నేహాని తగ్గిస్తే బాగుంటుంది.
ఈరోజు పనిచేసి రేపే ఫలితం రావాలని అనుకోవద్దు. కొన్ని సార్లు సమయం పడుతుంది. కొద్దిగా ఓపిక కావాలి. అలా అని ఫలితం కోసం వేచిచూస్తూ ఇంకో పని మొదలెట్టకుండా ఉండడమూ సరైన పని కాదు.