నాని టాక్స్ : కౌంట‌ర్ అదిరింది .. ప‌ది శాతం నిధులు ఇచ్చి ఇన్ని అబ‌ద్ధాలా !

-

బీజేపీకి, వైసీపీకి బంధాలు తెగిపోయాయి అని కొన్ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదే సంద‌ర్భంలో రాష్ట్రంలో ఎదుగుద‌ల కోసం, ప్ర‌తి కార్య‌క‌ర్త ఇంటిపై జెండా ఎగుర‌వేయించి, అటుపై రాష్ట్రంలో కాషాష దండు అధికారం తెచ్చుకోవ‌డం కోసం బీజేపీ బాస్ ఏమ‌యినా అబ‌ద్ధాలు చెబుతున్నారా అన్న అనుమానాలు వైసీపీ నుంచి వ‌స్తున్నాయి. వీటికి కౌంట‌ర్ ఇవ్వ‌డంలో వైసీపీ ముందుంది. అయితే నిన్న‌టి దాకా స‌ఖ్యంగా ఉన్న బీజేపీ, వైసీపీలో ఏం గొడ‌వ వ‌చ్చిందో కానీ జ‌గ‌న్ స‌ర్కారు దిగిపోవాల‌ని బీజేపీ బాస్ పిలుపునివ్వ‌డం వెనుక ఆంత‌ర్యం ఏంటి ?

పేర్లు మారిస్తే పరిస్థితులు మారిపోతాయా?
డ‌బ్బులు ఊరికే రావు కానీ ఇంకో మాట చెప్పండి !

ఆయుష్మాన్ భార‌త్ పేరునే ఆరోగ్య శ్రీ గా ఏపీ స‌ర్కారు మార్చింద‌ని బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా చెప్పారు. ఇందులో నిజం ఎంత ? అబ‌ద్ధం ఎంత ? కేంద్రం, రాష్ట్రం సంయుక్తంగా చేప‌ట్టే ప్రాజెక్టుల విష‌య‌మై కానీ ప‌థ‌కాల విష‌య‌మై కానీ బీజేపీ ఇచ్చిన నిధుల‌కు సంబంధించి లెక్క‌లెన్ని? ఇవే ఇప్పుడు చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. కేంద్రం పేరిట విడుద‌ల‌య్యేది ప‌ది శాతం నిధులు. మిగ‌తా 90 శాతం నిధుల‌నూ రాష్ట్ర ప్ర‌భుత్వాలే భ‌రించాలి. ఈపాటిదానికే మోడీ బొమ్మ వేయ‌డం ఎందుకు అని రాష్ట్రాలు ఎప్ప‌టి నుంచో గ‌గ్గోలు పెడుతున్నాయి. ఆయుష్మాన్ భార‌త్ అయినా లేదా ఆరోగ్య మిష‌న్ అయినా ఏదయినా కేంద్రం వెచ్చింపులు అన్న‌వి అత్య‌ల్పం.

….ఎవ‌రి మాట ఎంత నిజం ?

నిధులు లెక్క‌ల్లో మ‌త‌ల‌బేంటి ?

ఆ విధంగా చూసుకుంటే ఇప్ప‌టిదాకా ఆరోగ్య శ్రీ‌కి కేటాయించింది 230 కోట్లు అని, కానీ త‌మ ప్ర‌భుత్వం ఇప్ప‌టిదాకా వెచ్చించింది 2400 కోట్ల రూపాయ‌లు అని మాజీ మంత్రి పేర్నినాని చెబుతున్నారు. అంటే ఈ లెక్కన చూసుకుంటే ప‌ది శాతం నిధులు మాత్ర‌మే కేంద్రం ఇస్తూ డ‌ప్పు కొట్టుకోవ‌డం ఏంటి ? ఆరోగ్య శ్రీ అన్న‌ది జ‌గ‌న్ ప‌థ‌కం కాద‌ని మోడీ ప‌థ‌కం అని చెప్ప‌డం ఎంత‌వ‌ర‌కూ సబ‌బు అని ప్ర‌శ్నిస్తోంది మాజీ మంత్రి నాని. ఆరోగ్య శ్రీ కింద తాము దాదాపు ల‌క్షన్నర కోట్ల కుటుంబాల‌కు సాయం అందిస్తుంటే, కేంద్రం మాత్రం 55 ల‌క్ష‌ల కుటుంబాల‌కు మాత్ర‌మే ఆయుష్మాన్ భార‌త్ ను వ‌ర్తింప‌జేస్తోంది అని కూడా అంటున్నారు నాని. అంటే ప‌విత్ర గోదావ‌రి చెంత ఇన్ని అబ‌ద్ధాలు ఎలా మీరు చెప్ప‌గ‌లిగారు అని ప్ర‌శ్నిస్తున్నారాయన‌. చికిత్స అనంత‌రం విశ్రాంతిలో ఉండే రోగుల కోసం వైఎస్సార్ ఆరోగ్య ఆసరా ప‌థ‌కం కింద రూ.360 కోట్లు ఖ‌ర్చు చేస్తున్నామ‌ని చెప్పారు మాజీ మంత్రి నాని. అంటే ఈ లెక్క‌న కేంద్రం చెబుతున్న లెక్క‌లు అన్నీ అబ‌ద్ధాలే అని తేలిపోయింది అని కూడా అంటోంది వైసీపీ.

సంక్షోభంలో సంస్క‌ర‌ణ‌లా ? ఎప్పుడు ఎక్క‌డ ?

ఎపార్ట్ ఫ్ర‌మ్ దిస్…సంక్షోభంలో కూడా తాము ఆర్థిక సంస్క‌ర‌ణ‌లు తెచ్చామ‌ని అంటున్నారు జేపీ న‌డ్డా. అవే కనుక అమ‌లైతే ఇన్ని వేల కోట్ల అప్పులెందుకు చేశారు అని ప్ర‌శ్నిస్తోంది వైసీపీ. దేశంలో 80ల‌క్ష‌ల కోట్ల రూపాల‌యల మేర‌కు అప్పులున్నాయ‌ని లెక్క తేలింద‌ని ఈ డ‌బ్బుల‌తో ఏం చేశార‌ని నాని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. వాస్త‌వానికి ఎన్న‌డూ లేనంత‌గా ఈ ఎనిమిదేళ్ల‌లోనే విదేశీ రుణాల సంఖ్య కూడా పెరిగిపోయింది. అదేవిధంగా విల్ ఫుల్ డిఫాల్ట‌ర్ల సంఖ్య కూడా పెరిగిపోయింది. వీరిని నియంత్రిస్తున్నారా ? అన్న ప్ర‌శ్న ఇవాళ వైసీపీ నుంచి విన‌వ‌స్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news