నుపుర్ శర్మకు మద్దతుగా కంగనా రనౌత్

-

మాజీ బీజేేపీ నేత నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీంతో బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్న నుపుర్ శర్మను బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఇదిలా ఉంటే నుపుర్ వ్యాఖ్యలపై ముస్లిం దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇరాక్, లిబియా, మలేషియా, టర్కీ ఇలా పలు దేశాలు నుపుర్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కువైట్ లోని ఓ స్టోర్ భారతీయ ఉత్పత్తులను బహిష్కరించింది.

ఇలా ఉంటే నుపుర్ శర్మకు మద్దతుగా నిలిచింది కంగనా రనౌత్. అభిప్రాయాలను వెల్లడించే హక్కు అందరికి ఉంటుందని ఆమె ఇన్ స్టా గ్రామ్ లో వెల్లడించింది. అయితే నుపుర్ శర్మ ఆమె కుటుంబాన్ని హతమార్చుతామని బెదిరించడాన్ని కంగనా ఖండించింది. టీవీ ఛానెల్ డిబేట్ తో నుపుర్ చేసిన వ్యాఖ్యలను వ్యతిరేఖించే వారు ఆమెకు వ్యతిరేఖంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాని అన్నారు. ఇది ఆప్ఘనిస్తాన్ కాదని.. ప్రజాస్వామ్య పద్దతుల్లో ఇక్కడ పనిచేసే ప్రభుత్వం ఉందని ఆమె వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news