ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై మంత్రి కొడాలి నాని విరుచుకు పడ్డారు. చంద్రబాబుకు కనీసం మానవత్వం కూడా లేదని, ఉత్తరాంధ్ర, రాయలసీమ వాసులు గతంలో ఓట్లే వేయడంతోనే మూడు సార్లు ముఖ్యమంత్రిగా పాలించారని అది మరచిపోయి ఇంకా అమరావతికోసం ఆరాటపడుతుండటం విచారకరమని మండిపడ్డారు.
అసలు చంద్రబాబు, దేవినేని ఉమ ఆ పార్టీ నాయకులంతా కలిసి చంద్రబాబు వేసిన గ్రాఫిక్స్ రోడ్సపై 100 కిలో మీటర్ల స్పీడ్ తో పయనిస్తే… రాష్ట్రానికి పట్టిన శని పోతుందని, ఆ పార్టీకి కాస్త కొత్త రక్తమైనా వస్తుందని, ఇంకా ఎందుకు అంతలా ఆ పార్టీ నేతలు సొల్లు మాటలు మాట్లాడుతున్నారంటూ కొడాలి నాని విరుచుకు పడ్డారు.
అంతేకాకుండా స్వాంతంత్ర్యం వచ్చినప్పటి నుంచీ ఎన్నో ఏళ్లుగా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు మోసానికి గురౌతున్నారని, అలాంటిది వారి ఆవేదనను గమనించి అన్నీ ప్రాంతాలకు సమ న్యాయం చేసేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుంటే మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. అసలు ఈ సమయం చంద్రబాబుకు కీలకమైంది. ఆయన రాజకీయ జీవితంలో కనీసం ప్రతిపక్ష నాయకుడిగా అయినా ఉండేందుకు అర్హత ఉందా లేదా అనే విషయాన్ని తేల్చుకొనే సమయం. అందుకోసం ఆ పార్టీ నేతలైన చంద్రబాబు వద్దనుంచీ టీడీపీ నాయకులు అందరూ రాజీనామాలు చేసి గెలిచి అసలు ప్రతిపక్ష పాత్రకు ఆయన తగిన నేతా లేదా అనేది తేల్చుకోవాలని కొడాలి నాని చెబుతున్నారు. మరి నిజంగా ఇది చంద్రబాబుకు తేల్చేసుకోవాల్సిన సమయమే. మరి ఏం చేస్తారు అనేది వేచి చూడాలి!!