రమ్య హత్యపై కొడాలి సంచలనం..చంద్రబాబు లాంటి వెధవే చేశాడు !

-

గుంటూరు దళిత యువతి హత్య ఘటన పై చంద్రబాబు, లోకేష్ ల పై విరుచుకు పడ్డారు మంత్రి కొడాలి నాని. జగనన్న విద్యాకానుక కార్యక్రమాన్ని పక్కదారి పట్టించేందుకే లోకేష్ డ్రామాలని.. ఎక్కడో ఫేస్ బుక్ లో పరిచయం అయిన వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడని మండిపడ్డారు. 14 ఏళ్ళు సిఎం గా పని చేసిన చంద్రబాబు.. లోకేష్ తో లుచ్చా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టించాడని నిప్పులు చెరిగారు.
చంద్రబాబు లాంటి వెధవ దళిత యువతిని హత్యచేశాడని.. దాన్ని తీసుకుని వచ్చి ముఖ్యమంత్రికి అంటగడతున్నారని మండిపడ్డారు.


దళిత మహిళ శవాన్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబు శవ రాజకీయాలు చేస్తున్నారని.. ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను చూసి తట్టుకోలేకే ఇలాంటి చిల్లర పనులను దిగుతున్నారన్నారు. చంద్రబాబు, లోకేష్ కు ప్రజలు బుద్ధి చెప్పాలని.. నిందితుడిని 12 గంటల్లోనే పోలీసులు అరెస్ట్ చేశారని పేర్కొన్నారు.

వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు, యువతిని హత్యచేసిన నిందితుడికి తేడా లేదని.. చంద్రబాబు లాంటి వ్యక్తులను జైలుకు పంపించి అంతమొందిస్తే ఇలాంటి సంఘటనలు జరగవని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలో ఓడిపోయిన లోకేష్ కు సీఎమ్ జగన్ పై సవాళ్లు విసిరే స్థాయి లేదన్నారు. మహిళల పై దాడులు జరగకూడదనే దిశ చట్టం, దిశ యాప్ తీసుకువచ్చామని.. నిందుతులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తే లేదని సిఎం జగన్ స్పష్టం చేశారన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version