శ్రీలంక, భారత్ మధ్య ఈ నెల 4 నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభ కాబోతున్న విషయం తెలిసిందే. కాగ మొహాలిలో జరిగే మొదటి టెస్టుతో విరాట్ కోహ్లి కెరీర్ లో వంద టెస్టు కాబోతుంది. ఇప్పటి వరకు కోహ్లి 99 టెస్టులు ఆడాడు. ఈ టెస్టు మ్యాచ్ తో వంద టెస్టులు ఆడిన క్లబ్ చేరబోతున్నాడు. కాగ ఈ సందర్భంగా బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ.. విరాట్ కోహ్లిపై ఆసక్తిర వ్యాఖ్యలు చేశాడు. కెరీర్లో చాలా తక్కువ మందిలో ఒక్కరు మాత్రమే వందో టెస్టు మ్యాచ్ ఆడుతారని అన్నారు.
ఈ అదృష్టం అందిరికీ దక్కదని అన్నారు. అలాంటి వందో టెస్టు మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తాడని ఆశభావం వ్యక్తం చేశారు. అయితే ఆటగాళ్లు ఫామ్ కోల్పోవడం సహజమైన అంశం అని అన్నారు. దానిపై ఆందోళన చెందాల్సిన పని లేదని అన్నారు. అలాగే క్రికెట్ చరిత్రలో కొంత మంది ఆటగాళ్లు ఫామ్ కోల్పోయి.. గడ్డు పరిస్థితులు ఎదుర్కొని.. తట్టుకుని తిరిగి రాణించారని గుర్తు చేశారు. కోహ్లీ కూడా తన వందో టెస్ట్ మ్యాచ్ నుంచి ఫామ్ అందుకుని సెంచరీ పూర్తి చేస్తాడని భావిస్తున్నట్టు తెలిపారు.