కోమటిరెడ్డికి పెద్ద కష్టమే వచ్చిందిగా!

-

రాజకీయాలు ఎప్పుడు ఒకేలా నడవవు…సమయానికి తగ్గట్టుగా మారిపోతూ ఉంటాయి…అలాగే రాజకీయాల్లో ఒకే ఫార్ములా ఎప్పుడు వర్కౌట్ అవ్వదు…ఒకోసారి ఫెయిల్ కూడా అవ్వోచ్చు…ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో అదే జరిగేలా ఉంది. ఇప్పటికే ఆయన బీజేపీలో చేరడానికి రెడీ అయిన విషయం తెలిసిందే…అయితే కాంగ్రెస్ పార్టీతో పాటు…ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలని బీజేపీ అధిష్టానం చెబుతుంది. అలాగే ఉపఎన్నిక వస్తే తామే గెలిపించుకుంటామని అంటుంది. ఉపఎన్నికలో గెలిస్తే బీజేపీపై ప్రజల్లో నమ్మకం ఇంకా పెరుగుతుందనేది అధిష్టానం భావిస్తుంది.

ఈటల రాజేందర్ విషయంలో కూడా ఇదే చేశారు…టీఆర్ఎస్ తో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి బీజేపీలోకి తీసుకున్నారు…అలాగే ఉపఎన్నికలో రాజేందర్ సత్తా చాటారు. కానీ హుజూరాబాద్ పరిస్తితి మునుగోడులో కనిపించడం లేదు. ఇక్కడ కోమటిరెడ్డికి అంతా అనుకూలంగా ఏమి ఉన్నట్లు లేదు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడంలో ఎలాంటి ఇబ్బంది లేదు…కానీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంలోనే డౌట్ ఉంది.

ఇప్పటికే తన వెంట పూర్తిగా కార్యకర్తలు బీజేపీలోకి వచ్చే పరిస్తితులు కనిపించడం లేదు. వాస్తవానికి ఉమ్మడి నల్గొండలో బీజేపీకి ఏ మాత్రం బలం లేదు..అలాగే మునుగోడులో సైతం అదే పరిస్తితి. అందుకే కోమటిరెడ్డిని అభిమానించే కాంగ్రెస్ కార్యకర్తలు…బీజేపీలోకి రావడానికి మొగ్గు చూపడం లేదు. కోమటిరెడ్డి అంటే అభిమానం ఉన్నా సరే వారు..బలం లేని బీజేపీలోకి రాలేమని చెప్పేస్తున్నారు.

దీంతో కోమటిరెడ్డి కాస్త కన్ఫ్యూజన్ లో ఉన్నట్లు తెలుస్తోంది….అందుకే బీజేపీలో చేరే విషయాన్ని కూడా వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది…పూర్తి స్థాయిలో క్యాడర్ తనతో రాకపోతే ఉపఎన్నికలో గెలవడం కష్టమైపోతుందని ఆయన భావిస్తున్నారు. కానీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తే ఉపఎన్నికలో గెలిపించే బాధ్యత తమది అని బీజేపీ అగ్రనేతలు చెబుతున్నట్లు తెలుస్తోంది. అయినా సరే కార్యకర్తల బలం లేకుండా గెలవలేమని చెప్పి కోమటిరెడ్డి జంకుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే కోమటిరెడ్డికి పెద్ద కష్టమే వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news