ఏమి దొర నీవల్ల ఉపయోగం?- వైయస్ షర్మిల

-

అదిలాబాద్ జిల్లా యాపల్ గూడ గ్రామంలో భారీ వర్షాల కారణంగా పంట దెబ్బతిని ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ ఘటనపై సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.”మునిగిపోయే కాలేశ్వరానికి లక్షల కోట్లు అప్పు తెచ్చి పెట్టొచ్చు కానీ, అన్నం పెట్టే రైతులను ఆదుకోవడానికి పైసలు లేవా? వానలకు, వరదలకు లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయిన రైతులు.. ఆదుకోవలసిన సర్కార్ ఆసరా లేదని ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఏ ఒక్క రైతునైనా ఆదుకున్నావా కేసీఆర్?

వరదలకు ఇండ్లు మునిగిపోయి, కట్టు బట్టలతో రోడ్డున పడ్డ బాధితులకు సాయం చేశావా? పదివేల సాయం అని ప్రకటనలు చేసి వారాలు గడుస్తున్న ఇప్పటివరకు పైసా అన్న ఇచ్చావా? పంటల బీమా చేయడం చేతకాదు, నష్టపోయిన రైతులను ఆదుకోవడం చేతకాదు, వరదల్లో సర్వం కోల్పోయిన బాధితులను ఆదుకోవడం చేతకాదు, ఏమి దొర నీ వల్ల ఉపయోగం?” అంటూ ట్వీట్ చేశారు వైయస్ షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news