తెలంగాణ కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. అయితే.. నిన్న రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన తరువాత.. టీపీసీసీ రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి రాజగోపాల్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. దీంతో రేవంత్ వ్యా్‌ఖ్యలపై రాజగోపాల్ రెడ్డి ఘాటుగా స్పందించారు. రేవంత్‌రెడ్డి తెలంగాణను అమ్మేస్తడని రాజగోపాల్‌రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. బ్లాక్‌మెయిల్ రాజకీయాలతో డబ్బులు సంపాదించి పీసీసీ పదవిని చేపట్టిన రేవంత్ ముఖ్యమంత్రి పదవి చేపట్టి.. రాష్ర్టాన్ని దోచుకోవాలని ఎత్తుగడ వేస్తున్నారన్నారు రాజగోపాల్‌రెడ్డి. సోనియాను బలిదేవత అన్నోడికి పీసీసీ చీఫ్ పదవి ఇస్తారా అని ఆగ్రహం వ్యక్తంచేశారు రాజగోపాల్‌రెడ్డి. కాంగ్రెస్‌ను నాశనం చేసేందుకే రేవంత్‌రెడ్డి ఉన్నాడని పేర్కొన్నారు రాజగోపాల్‌రెడ్డి. అందువల్లే తాను కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానని మంగళవారం మీడియా ముందు ప్రకటించారు రాజగోపాల్‌రెడ్డి.
బీజేపీలో చేరుతున్నట్టు సంకేతాలిచ్చారు రాజగోపాల్‌రెడ్డి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని 20 ఏండ్లపోటు తిట్టిన రేవంత్‌రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇచ్చారన్నారు. ఏ వ్యాపారమూ చేయని రేవంత్‌రెడ్డికి కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. బ్లాక్ మెయిల్‌చేసి సంపాదించిన సొమ్ముతో పీసీసీ పదవి తెచ్చుకొన్నారని, కాంగ్రెస్ పార్టీ ద్వారా ముఖ్యమంత్రి అయి తెలంగాణ రాష్ర్టాన్ని దోచుకోవాలనే ఎత్తుగడతోనే రేవంత్ ఉన్నారని ఆరోపించారు. రేవంత్‌లాంటి వాళ్ల వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ నాశనమైందని విరుచుకుపడ్డారు రాజగోపాల్‌రెడ్డి. కాంగ్రెస్‌లో తనకు ఆత్మగౌరవం లేదని, నాలుగైదు పార్టీలు మారి, ప్రజల ముందు నోట్ల కట్టలతో దొరికి జైలుకు వెళ్లిన వారి కింద పనిచేయలేకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు రాజగోపాల్‌రెడ్డి ప్రకటించారు రాజగోపాల్‌రెడ్డి.