కాంగ్రెస్ పార్టీ కమీటీ లు వేశాక చూస్తున్నారు ఆ పార్టీ పరిస్థితి.. డబ్బులు ఇచ్చి పీసీసీ పదవి తెచ్చుకుండు రేవంత్ రెడ్డి అంటూ మరోసారి విమర్శలు గుప్పించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తాజాగా ఆయన మునుగోడులో మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి కింద పని చేసిందానికంటే రాజకీయం మానేయలని, మీరు ఇప్పుడు అంటున్నారు.. నేను ఎప్పుడో చెప్పాను రేవంత్ రెడ్డి గురించి అని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులారా బీజేపీ లోకి రండి.. కాంగ్రెస్ పార్టీలో మంచి మంచి నాయకులు వున్నారు.. బహిరంగంగా ఆహ్వానిస్తున్నా కాంగ్రెస్ నాయకులను.. బీజేపీ లో కి రమ్మని.. కాంగ్రెస్ పార్టీ కి ఓటేసినా టీఆరెఎస్ కు వేసిన ఒకటే.. నేను రేవంత్ రెడ్డి గురుంచి మాట్లాడినప్పుడు ఎవరు నమ్మలేదు.. ఇప్పడు ఆలోచిస్తున్నారు అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే.. : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ముసలం ముదురుతోంది. రోజుకో నేత అసమ్మతి గళం వినిపిస్తూ కాక రేపుతున్నారు. తాజాగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సీనియర్లు తిరుగుబాటు చేశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నివాసంలో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ భేటీకి మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, మధు యాష్కీ, కోదండా రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, ఏలేటి మహేశ్వర్ రెడ్డి తదితర సీనియర్ నేతలు హాజరయ్యారు. ఇటీవల పార్టీ అధిష్టానం ప్రకటించిన కొత్త కమిటీలపై టీకాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తమను సంప్రదించకుండానే కమిటీలు ఏర్పాటు చేశారని మండిపడుతున్నారు.