ఇటీవల సీఎం కేసీఆర్ నిర్వహించిన మీడియా సమావేశంపై భగ్గుమంటున్నాయి. రాష్ట్రంలో ప్రజుల వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కుంటుంటే కేసీఆర్ రాజకీయాలు మాట్లారంటూ విపక్షాలు భగ్గుమంటున్నాయి. తాజాగా కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ కు దైర్యం వుంటే ఇప్పుడు ఎన్నికలు పెట్టాలన్నారు. బీజేపీ కి గ్రామస్థాయిలో కార్యకర్తలు లేరని, ఎన్నికల ముందు గొఱ్ఱెలు , బర్రెలు గుర్తుకు వస్తాయి, గెలిచిన తరువాత మరిచిపోవడమే కేసీఆర్ నైజం.
5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కూడా గ్రామాలను అభివృద్ధి చేయలేదు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రజలు విశ్వశిస్తున్నారు. గ్రామ పంచాయితీలలో నిధులు లేక ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను బెదిరింపులకు గురిచేస్తే చూస్తూ ఊరుకునేది లేదు. కాంగ్రెస్ కార్యకర్తలపై చేయి పెడితే ఆ చేయి నరికి వేస్తామని అధికార పార్టీ నాయకులను హెచ్చరించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీజేపీ, టీఆర్‌ఎస్ రైతుల పట్ల కపట ప్రేమ నటిస్తున్నారని ఆయన మండిపడ్డారు.