కాంగ్రెస్ పార్టీ మాజీ నేత, చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇవాళ బీజేపీలో చేరనున్నారు. నేడు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో అధికారికంగా బిజెపి పార్టీలో చేరతారని…. నాయకులు చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమకారుడు, ఉమ్మడి ఏపీ మాజీ డిప్యూటీ సీఎం కెవి రంగారెడ్డి కి విశ్వేశ్వర్ రెడ్డి మనవడు. అపోలో ఆసుపత్రుల వ్యవస్థాపకుడు ప్రతాప్ సి రెడ్డి కుమార్తె సంగీతారెడ్డి ఈయనకు భార్య.
మెగా కోడలు ఉపాసన తల్లి శోభన కామినేని, సంగీతారెడ్డి అక్క చెల్లెల్లు కావడంతో ఆ కుటుంబంతో బంధుత్వం ఉంది. కాగా సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు 2013లో టిఆర్ఎస్ పార్టీలో చేరిన విశ్వేశ్వర్ రెడ్డి 2014లో చేవెళ్ల ఎంపీగా గెలుపొందారు. పార్లమెంటు సభ్యుడిగా పని చేస్తున్నప్పుడు యూఎస్ పేటెంట్ పొందిన ఏకైక భారత పార్లమెంటేరియన్ ఈయనే కావడం విశేషం.
2014 అలాగే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సమయంలో అఫిడవిట్ లో పేర్కొన్న ఆస్తులు ఆధారంగా తెలంగాణలో అత్యంత ధనిక రాజకీయ నేతగా నిలిచారు. ఆ తర్వాత అ టీఆర్ఎస్ పార్టీని వీడిన కొండా… 2019 లోక్సభ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన ఏ పార్టీలోనూ లేరు.