ఇవాళ ఉదయం 9 గంటలకు చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి టెంపుల్ కి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోనున్నట్లు ప్రకటించారు ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి. తెలంగాణలో బీజేపీ దేవుళ్ళ పేరు మీద చేస్తున్న రాజకీయానికి తెలంగాణ ప్రజలు అయోమయంలో పడ్డారని… కేంద్రం లో బీజేపీ పార్టీ కి ప్రజలకు ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే అవకాశం ఇచ్చారని పేర్కొన్నారు.
కానీ ప్రజల సమస్యలు పరిష్కరించకుండా ,మంచి పరిపాలన ఇవ్వడం లేదు బీజేపీ ప్రభుత్వం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను రాజకీయాలకు సంబంధం లేకుండా భాగ్యలక్ష్మి అమ్మవారిని ప్రతి దీపావళి కి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుందని… కానీ ఇవాళ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడానికి ముఖ్య కారణం ఉందన్నారు.
ప్రజలకు మంచి పరిపాలన చేసేవిధంగా బీజేపీ నాయకులకు మంచి జ్ఞ్యానని, బుద్దిని ప్రసాదించు తల్లి అని కోరడానికి టెంపుల్ పోతున్నానని వెల్లడించారు. నాతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్, అనిల్ కుమార్ యాదవ్ మరియు ఇతర నేతలు అమ్మవారిని దర్శించుకుంటారని చెప్పారు.