చంద్రబాబు డ్రగ్స్ తీసుకున్నాడు.. నార్కో టెస్టులు చేయాలి : ఏపీ ప్రభుత్వ విప్

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు టిడిపి అధినేత చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు డ్రగ్స్ వాడుతున్నాడా అనే అనుమానం ఉంది…తీసుకున్నాడు కావచ్చు.. చంద్రబాబు కు నార్కో పరీక్ష చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు కు మతిపోయిందని.. చంద్రబాబుకు చిన్న మెదడు చిట్లినట్టుందన్నారు.

అధికార దాహం తో, అధికార మదం తో ఢిల్లీ కి వెళ్లి ఆర్టికల్ 356 అమలు చేయాలంటున్నారని అగ్రహించారు ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు. ఏపీ సిఎం జగన్ మోహన్ రెరెడ్డి పై చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు కొరముట్ల శ్రీనివాసులు. డ్రగ్స్ అంటూ విషాన్ని కక్కుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు వ్యవస్థ లను మేనేజ్ చేస్తున్నారని.. బద్వేల్ లో బీజేపీ ని చంద్రబాబు వెనుక ఉండి నడిపిస్తున్నారని అగ్రహించారు. తెలుగు దేశం పార్టీ కి త్వరలోనే ప్రజలు తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు.