దారుణం : కోరుట్లలో కౌన్సిలర్ భర్తపై కత్తులతో దాడి

-

జగిత్యాల జిల్లా కోరుట్లలో దారుణం జరిగింది. అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ కౌన్సిలర్ భర్తను పట్టపగలే అది దారుణంగా హతమార్చారు. పట్టణంలోని తొమ్మిదో వార్డుకు చెందిన బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్‌ భర్త పోగుల లక్ష్మీరాజం(48) మీద.. ఇద్దరు గుర్తు తెలియని దుండగులు బైక్‌పై వచ్చి అందరూ చూస్తుండగానే కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో లక్ష్మీరాజం మెడపై తీవ్రగాయాలవ్వగా.. స్థానికులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు.

అయితే.. అప్పటికే రక్తస్రావం ఎక్కువగా ఉండడంతో పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది. దీంతో లక్ష్మీరాజం ఆస్పత్రిలో చేరిన కొద్దిసేపటికే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. అక్కడున్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి దాడికి పాల్పడిన వారి కోసం గాలిస్తున్నారు. అయితే ఘటనా స్థలాన్ని డీఎస్పీ రవీందర్ రెడ్డి, సీఐ ప్రవీణ్ కుమార్ కూడా పరిశీలించారు. దాడి చేసింది ఎవరు, కారణాలేంటి? ఈ ఘటనతో కోరుట్లలో భయానక వాతావరణం నెలకొంది.

అయితే.. లక్ష్మీరాజం మామిడి తోటల కాంట్రాక్టర్‌. ఈ క్రమంలో పలు భూములకు సంబంధించి వివాదాలు కూడా ఉన్నాయి. అయితే.. పాత కక్షల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అందులోనూ.. లక్ష్మీరాజం చనిపోయే ముందు నాగరాజు అనే పేరును ఉచ్చరించినట్లు తెలుస్తోంది. ఆ నాగరాజు ఎవరు? అతను ఆ పేరును ఎంత పలికాడు? వచ్చిన వారిలో నాగరాజు అనే వ్యక్తి ఉన్నాడా? ఇప్పుడది చర్చనీయాంశంగా మారింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version