కృష్ణంరాజు అలా చనిపోవాలని కోరుకున్నారట!!

-

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 3.25 గంటలకు తుది శ్వాస విడిచి, చిత్ర పరిశ్రమను విషాదంలో నింపారు.

అయితే జీవిత లక్ష్యం గురించి చెప్పమంటే ఎవరైనా ‘బాగా సంపాదించాలి’, ‘మంచి గుర్తింపు పొందాలి’ అని అంటారు. కృష్ణంరాజు మాత్రం ‘నేనెవరికీ అన్యాయం చేయలేదని గుండె మీద చేయి వేసుకుని కన్నుమూయాలి’ అని చెప్పారు. అవును, ఈ మాటలు కృష్ణంరాజు నుంచి వచ్చినవే. తానెలా చనిపోవాలనుకుంటున్నారో సుమారు 16 ఏళ్ల క్రితమే ఓ ఇంటర్వ్యూలో ఆయన పంచుకున్నారు.

‘‘ప్రతి మనిషికీ ఓ జీవిత లక్ష్యం ఉండాలంటారు. దీని గురించి నాగార్జున ఫెర్టిలైజర్స్‌ కేవీకే రాజుగారికీ, నాకు మధ్య ఓసారి ఆసక్తికర చర్చ సాగింది. అప్పుడు నేను చెప్పిన మాటలివీ.. ‘‘పచ్చని చెట్టు నీడలో కూర్చొని.. నా జీవితంలో నేను ఎవరికీ అన్యాయం చేయలేదని.. గుండెల మీద చేతులు వేసుకుని.. నిర్మలమైన ఆకాశం వంక చూస్తూ తుదిశ్వాస విడవాలి. ఆ రోజూ, ఈరోజూ.. అదే నా కోరిక’’ అని కృష్ణంరాజు చెప్పడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం.

Read more RELATED
Recommended to you

Exit mobile version