Krithi Shetty : ట్రెడిషనల్ ఔట్ ఫిట్ లో మెరిసిపోతున్న బేబమ్మ

-

కృతి శెట్టి సోషల్ మీడియాలో తాజాగా కమ్ బ్యాక్ ఇచ్చింది. ఈమధ్య కాస్త గ్యాప్ తీసుకున్న ఈ భామ తాజాగా తన ఫొటోలు షేర్ చేసింది. ఎల్లో కలర్ లెహంగాలో చాలా అందంగా కనిపించింది. ఈ ఔట్ ఫిట్ లో బేబమ్మ మెరిసిపోయింది. తన మెస్మరైజింగ్ లుక్స్ తో సందడి చేసింది.

కృతి ట్రెడిషనల్ లుక్స్ చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. బేబమ్మ. ఈజ్ సో బ్యూటీఫుల్, ఎంతందంగా ఉన్నావే బేబమ్మ.. ఐలవ్యూ బేబమ్మ.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం కృతి ట్రెడిషనల్ ఫొటోలు నెట్టింట ట్రెండింగ్ మారాయి.

ఇక కృతి సినిమాల విషయానికి వస్తే తాజాగా నాగచైతన్యతో కలిసి కస్టడీ సినిమాలో నటించింది. గతేడాది ఈ బ్యూటీకి బ్యాడ్ ఇయర్ నే చెప్పాలి. ఆమె నటించిన మూడు సినిమాలు నెలల గ్యాప్ లో భారీ డిజాస్టర్స్ అయ్యాయి. దానితో బేబమ్మ సైలెంట్ అయిపోయింది. సోషల్ మీడియాలో కూడా అంతగా యాక్టివ్ గా లేదు. తాజాగా కస్టడీ సినిమా ప్రమోషన్స్ కోసం మళ్లీ ఈ బ్యూటీ నెట్టింట కమ్ బ్యాక్ ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version