కృతి సనన్.. టాలీవుడ్‌లో ఈ బ్యూటీ మహేశ్ బాబు సరసన వన్ నేనొక్కడినే సినిమాతో అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది. ఈ సినిమాలో ఆవ్ తుజె మోక్కోడ్తా పాటలో కృతి అందాలకు తెలుగు కుర్రాళ్లు ఫిదా అయ్యారు. ఈ సినిమా తర్వాత తెలుగులో నాగచైతన్య నటించిన దోచెయ్ సినిమాలో సందడి చేసింది. ఆ సినిమా ఫెయిల్ అవ్వడంతో ఇక ఈ భామ మళ్లీ తెలుగు తెరవైపు కన్నెత్తలేదు.
ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్‌లో ఫుల్ బిజీ హీరోయిన్. రీసెంట్‌గా భేడియా మూవీలో నటించి సూపర్ హిట్ అనిపించుకుంది. ఇక రీసెంట్‌గా కృతి బాలీవుడ్‌లో షెహజాదా అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా తెలుగులో అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో మూవీకి రీమేక్. బీ టౌన్‌లో ఈ చిత్రంలో హీరోగా కార్తీక్ ఆర్యన్ నటిస్తున్నాడు.
ప్రస్తుతం కృతి షెహజాదా సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. షెహజాదా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న కృతి సనన్ రోజుకో అవుట్‌ఫిట్‌తో ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తోంది. తాజాగా నియాన్ కలర్ డ్రెస్సులో కృతి షెహజాదా ప్రమోషన్స్‌లో పాల్గొంది. ఈ ఔట్‌ఫిట్‌లో కృతి అందాలు.. ఆకృతి .. క్లియర్‌గా కనిపిస్తోంది.
ఈ ఫొటోలను కృతి సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవి చూసిన ఫ్యాన్స్ తెగ కామెంట్లు చేస్తున్నారు. ప్రభాస్ మేడమా మజాకా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మేడమ్ సార్ మేడమ్ అంతే.. కృతి ఏంటా ఆకృతి.. అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు అభిమానులు. మరోవైపు ఈ ఫొటోల్లో కృతి కాస్త గ్లామర్ డోస్ బాగానే పెంచేసింది. వంగి వంగి తన అందాలు చూపిస్తూ కుర్రాళ్ల మతి పోగొడుతోంది.