సిఎం పదవిపై కేటిఆర్ కీలక వ్యాఖ్యలు…!

-

కొత్త దశకంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రం అగ్రగామిగా ఎదుగుతుందని మంత్రి కేటిఆర్ విశ్వాసం వ్యక్తం చేసారు. తెలంగాణా భవన్ లో మీడియా తో మాట్లాడుతూ కేటిఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. 2019వ సంవత్సరం తమకు బ్రహ్మాండమైన ఆరంభం ఇచ్చిందన్న మంత్రి 2020 కూడా మున్సిపల్‌ ఎన్నికల్లో ఘనవిజయంతో శుభారంభం చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేసారు. సంక్రాంతి తర్వాత జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను కేసీఆర్‌ ప్రారంభిస్తారని కేటిఆర్ అన్నారు. వారంలో కేసీఆర్‌ అధ్యక్షతన పార్టీ సమావేశం జరుగుతుందన్నారు.

ఆ సమావేశంలో మున్సిపల్‌ ఎన్నికలకు సమాయత్తంపై నేతలకు ఆయన దిశానిర్దేశం చేస్తారన్నారు. కొత్త మున్సిపల్‌ చట్టం సమర్థంగా అమలు చేయడమే తమ ముందున్న లక్ష్యమన్నారు. చట్టం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కౌన్సిలర్‌పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక ఈ సందర్భంగా తాను సిఎం అవుతున్నా అనే ప్రచారంపై ఆయన స్పందించారు. ఈ ఏడాది తాను సీఎం అవుతానన్న చర్చ అవసరం లేదన్నారు. 2020-2030 దశకం తెరాస నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్రానిదేనని విశ్వాసం వ్యక్తం చేసారు.

ఎన్‌పీఆర్‌, ఎన్‌ఆర్‌సీపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని కేటిఆర్ అన్నారు. ఏపీ సహా పొరుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో సత్సంబంధాలు కొనసాగిస్తామని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ సుదీర్ఘ చరిత్ర ఉన్న పార్టీ అన్న ఆయన దాన్ని తక్కువగా అంచనా వేయబోమని స్పష్టం చేసారు. తమకు ఇప్పటికీ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్సేనని అన్నారు. తన చిన్నప్పుడు బిజెపి ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉందన్నారు. ఇక మజ్లీస్ తో ఎన్నికల్లో పోటి చేసేది లేదని కేటిఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news