సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేటీఆర్

-

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫార్ములా ఈ-కార్ రేసు కేసు లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో ఆయన సవాల్ చేశారు. ఫార్ములా ఈ కార్ కేసులో ఏసీబీ కేసు కొట్టేయాలని కేటీఆర్ వేసి క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. ఏసీబీ దర్యాప్తులో మేము జోక్యం చేసుకోమని తీర్పు సందర్భంగా పేర్కొంది. ఆ సమయంలో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కేటీఆర్ తరపు న్యాయవాది కోరగా.. ఆ విజ్ఞప్తిని ధర్మాసనం పరిగణలోకి తీసుకోలేదు. 

తాజా పరిణామాలపై ఏసీబీ ఆఫీస్ లో అధికారులు భేటీ అయ్యారు. ఎఫ్ఈవో, హెచ్డీఏతో పాటు రెవెన్యూ అధికారుల పాత్ర పై చర్చించడంతో పాటు సుప్రీంకోర్టును కేటీఆర్ ఆశ్రయించడంతో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా చర్చించారు. అధికారులు అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి నోటీసులపై చర్చతో పాటు మొదటి రేసు తరువాత తప్పుకున్న కంపెనీలపై చర్చించారు. క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేయడంతో సుప్రీంకోర్టును కేటీఆర్ ఆశ్రయించారు. తమ వాదన కూడా వినాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news