ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లతో వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్: కేటీఆర్

-

తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లకు సంబంధించి ఈరోజు టీఎస్ఐఐసీ కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది.మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, సీఎస్ సోమేశ్ కుమార్ తో పాటు వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్(KTR) మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలు మరియు సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు భారీగా పెరిగాయని అన్నారు.

కేటీఆర్/KTR
కేటీఆర్/KTR

తెలంగాణలో వ్యవసాయ రంగ అభివృద్ధి భారీగా పుంజుకుందని తెలిపారు. తెలంగాణ భారతదేశంలో రెండో హరిత విప్లవానికి నాంది పలికిందని, దీంతో పాటు మాంసం, పాల ఉత్పత్తి, మత్స్య రంగాల్లోనూ వేగంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. అయితే ప్రస్తుతం పెరిగిన వ్యవసాయ ఉత్పత్తులకు అవసరమైన డిమాండ్ ను,మార్కెటింగ్ సదుపాయాలను సృష్టించాలంటే భారీ ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని రాష్ట్రంలో మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం కేవలం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను మాత్రమే ఏర్పాటు చేయకుండా ప్రత్యేకంగా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ఏర్పాటు చేయడం ద్వారా, పెద్ద ఎత్తున వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ సృష్టించే అవకాశం కలుగుతుందని తెలిపారు. వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా పండేందుకు అవకాశాలు ఉన్న వ్యవసాయ ఉత్పత్తుల ఆధారంగా ఈ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ఏర్పాటు చేస్తామన్నారు.

ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుకు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న ఏర్పాట్లను అధికారులు కేటీఆర్ కు వివరించారు. ఒక్కో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ కనిష్టంగా 225 ఎకరాలకు తగ్గకుండా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని, ఈ జోన్లలో అన్ని రకాల మౌలిక వసతులు ఉంటాయన్నారు. ఇప్పటికే ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లకు సంబంధించి ప్రభుత్వం పిలిచిన ఎక్స్ ప్రెషన్ అఫ్ ఇంట్రెస్ట్ కి సుమారు 350 దరఖాస్తులు అందాయని అధికారులు తెలపాగా.., దీని గడువును మరింతగా పెంచి మరిన్ని కంపెనీలను భాగస్వాములను చేయాలని అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news