హ్యాట్రిక్‌పై కేటీఆర్ ఆశలు..కమలం-కాంగ్రెస్‌లతో ఈజీ కాదు.!

-

తెలంగాణలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని చెప్పి కేసీఆర్ ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఈ సారి తెలంగాణలో బి‌ఆర్‌ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి..ఆ తర్వాత ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని చూస్తున్నారు. ఇక కే‌సి‌ఆర్ అటు వెళితే..రాష్ట్రంలో బాధ్యతలు కే‌టి‌ఆర్ చూసుకుంటారని అర్ధమవుతుంది. అందుకే రాష్ట్రంలో ఖచ్చితంగా అధికారం సాధించాలని మళ్ళీ కష్టపడుతున్నారు.

ఇదే క్రమంలో మరొకసారి గెలిచి హ్యాట్రిక్ కొడతామని కే‌టి‌ఆర్ ధీమాగా ఉన్నారు. తాజాగా సిరిసిల్లలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మరొకసారి అధికారంలోకి వస్తామని చెప్పారు.  మోదీ వచ్చి గల్లీ గల్లీ, ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసినా.. కాంగ్రెసోళ్లు కాళ్లావేళ్లా పడ్డా.. పేదల గుండెల్లో గూడు కట్టుకున్న కేసీఆర్‌ను ఎవరూ ఓడించలేరని, ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో గెలిచి, కేసీఆర్‌ హ్యాట్రిక్‌ సాధించడం ఖాయమని, ఇక దక్షిణ భారతదేశంలో ఇప్పటిదాకా ఎవరూ హ్యాట్రిక్‌ సాధించలేదని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

అయితే తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చూపిస్తే రాజకీయాలను శాశ్వతంగా వదిలేస్తానని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సవాల్ చేశారు. దేశానికి, రాష్ట్రానికి కేసీఆర్‌, కేటీఆర్‌ నాయకత్వం అవసరమని తెలిపారు. అంటే ఇక్కడ బి‌ఆర్‌ఎస్ కాన్సెప్ట్ ఒక్కటే మూడోసారి అధికారంలోకి రావడం కే‌టి‌ఆర్ సి‌ఎం కావడం..కే‌సి‌ఆర్ ఏమో జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళడం. కానీ ఇది సులువుగా జరుగుతుందా? అంటే చెప్పలేం. ఈ సారి సులువుగా గెలవడం జరిగే పని కాదని చెప్పవచ్చు.

ఎందుకంటే అటు వైపు బి‌జే‌పి, కాంగ్రెస్ పార్టీలు బలంగా ఉన్నాయి. గతంలో మాదిరిగా అవి వీక్ గా లేవు. కాకపోతే బి‌ఆర్‌ఎస్ పార్టీకి అడ్వాంటేజ్ ఏంటంటే..బి‌జే‌పి-కాంగ్రెస్ పార్టీల మధ్య ఓట్లు చీలితే తమకు లాభమని భావిస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలు ఒక్కసారి వ్యతిరేకంగా ఉంటే..బి‌ఆర్‌ఎస్ పార్టీకి చుక్కలు కనబడతాయి..బి‌జే‌పి, కాంగ్రెస్ ల్లో ఏదొక పార్టీని గెలిపించిన గెలిపిస్తారు. మొత్తానికైతే ఈ సారి బి‌ఆర్‌ఎస్ పార్టీకి హ్యాట్రిక్ ఈజీ కాదు.

Read more RELATED
Recommended to you

Latest news