హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్నాహం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండగా.. ఆ తర్వాత ఒక్కసారిగా నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. హైదరాబాద్ సిటీలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. హైదరాబాద్- సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో గాలి వాన కురిసింది. ఉప్పల్, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట్, చార్మినార్‌తో పాటు సైదాబాద్, మాదన్నపేట్ పరిసర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురుస్తోంది. అంబర్‌పేట్, ముషీరాబాద్, రాంనగర్, మారేడుపల్లిలో వడగళ్ల వాన కురిసింది. నగరంలోని పలుచోట్ల రహదారులపై నీరు నిలిచిపోయింది. భారీ వర్షం కురియడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రాజేంద్రనగర్ వ్యవసాయ యూనివర్సిటీ బ్యాక్ సైడ్ రాజేంద్రనగర్ జోన్ డీసీపీ కార్యాలయం ప్రాంగణంలో పిడుగుపాటుకు కొబ్బిరి చెట్టు కాలిపోయింది. ఉదయం ఎండలు, సాయంత్రం వర్షాలతో నగర వాసులు ఇబ్బంది పడుతున్నారు. మార్నింగ్ 8 గంటల నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. మధ్యాహ్నం వరకు తీవ్రమవుతున్నాయి. ఎండలు ఎక్కువవడంతో జనం కూడా బయటకు వెళ్లాలంటే ఆలోచిస్తున్నారు. సాయంత్రం కాగానే బయటకు వెళ్దామనుకునే సరికి వర్షాలు పడుతున్నాయి. ఈ అకాల వర్షాలు జనాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. గ్రామాల్లో వరి చేన్లుర, మామిడి తోటలు దెబ్బతింటున్నాయి. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.