గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కలవకుంట్ల తారకరామారావు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా… గులాబీ పార్టీ సోషల్ మీడియా స్టార్ నల్లబాలు ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. సోషల్ మీడియా వారియర్ నల్లబాలు అలియాస్ శశిధర్ గౌడ్ ఇంటికి.. కాసేపటి క్రితమే కేటీఆర్ బయలుదేరారు.

ఇక శశిధర్ గౌడ్ ఇంట్లోనే తన పుట్టినరోజు వేడుకలను నిర్వహించుకోబోతున్నారు.. ఇటీవల రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న పోస్టును నల్లబాలు రీ ట్వీట్ చేశాడు. దీంతో నల్లబాలును అరెస్టు చేశారు పోలీసులు. రిమాండ్ కు కూడా పంపించారు. అలాంటి నల్లబాలు ఇంట్లోనే ప్రస్తుతం కేటీఆర్ వేడుకలు జరుపుకునేందుకు సిద్ధమయ్యారు.