సాధారణంగా రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులు రాజకీయాల్లోకి దిగుతూ ఉంటారు. మరి ముఖ్యంగా పార్టీల అగ్రనేతలు వారి వారసులకే తిరిగి పార్టీ బాధ్యతలను కట్టబెడుతూ ఉంటారు. మన దేశంలో ఏ రాష్ట్రంలో చూసుకున్న దాదాపు ఇలాంటి పరిస్థితులే కనిపిస్తూ ఉంటాయి. ఇక తెలంగాణలోనూ ఇదే పరిస్థితి ఉంది. అధికార టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఇప్పటికే తన తనయుడు కేటీఆర్‌కు పార్టీ బాధ్యతలను అప్పగించాడు. ప్రస్తుతం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ పార్టీ బాధ్యతలను చూసుకుంటున్నాడు.
అయితే కేటీఆర్ కుమారుడు హిమాన్షు (Himanshu) కూడా కొన్నేళ్ళ తర్వాత అయిన రాజకీయ రంగ ప్రవేశం చేయక తప్పదని అంతా అనుకుంటూ ఉంటారు. అయితే రాజకీయాల్లోకి ఎంట్రీపై హిమాన్షు ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని హిమాన్షు ట్విట్టర్ ద్వారా పేర్కొన్నాడు. తను రాజకీయాల్లోకి రానని.. తనకు సాకారం చేసుకోవాల్సిన కలలు ఉన్నాయని, అలాగే తాను సాధించాల్సిన లక్ష్యాలు ఉన్నాయని తెలిపాడు.