పురపాలక చట్టసవరణ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టిన మంత్రి కేటీఆర్

-

శాసనసభలో రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ పురపాలక చట్టసవరణ బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం పద్దులపై చర్చకు సమాధానం ఇచ్చారు. చేనేత గురించి మాట్లాడుతూ.. చేనేతకు రికార్డు స్థాయిలో బడ్జెట్ కేటాయింపులు దక్కాయని తెలిపారు. రాష్ట్రం చేనేత రంగాన్ని ఆదుకుంటుంటే.. కేంద్రం చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు. చేనేత ఉత్పత్తులపై ప్రధాని మోదీ 5 శాతం పన్ను విధించారని.. దాన్ని 12 శాతానికి పెంచాలని చూస్తున్నారని అన్నారు.

చేనేతకు సంబంధించిన అనేక బోర్డులను కేంద్రం రద్దు చేసిందని కేటీఆర్ మండిపడ్డారు. ఆల్‌ ఇండియా పవర్‌లూమ్‌ బోర్డు, ఆల్‌ ఇండియా హ్యాండ్‌లూమ్‌ బోర్డును రద్దు చేసిన కేంద్రం నుంచి నేతన్నకు శుష్క వాగ్దానాలు, రిక్త హస్తాలే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న నేతన్నలకు కేంద్రం అన్యాయం చేస్తోందని వాపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news