ప్రధాని మోదీ చెప్పేవన్ని జుమ్లా, గాలి మాటలే అని విమర్శించారు మంత్రి కేటీఆర్. వరంగల్ జిల్లా నర్సంపేట పర్యటనలో ఉన్న ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. గ్యాస్ ధరలు రూ. 400 ఉన్నప్పడే మోదీ గ్యాస్ బండకు దండం పెట్టుకుని నాకు ఓటేయాలని అడిగారని… మరి ఇవ్వాల ఏం చేశారని ప్రశ్నించారు. ప్రస్తుతం గ్యాస్ ధర రూ. 1000కి పెరిగింది. ఇప్పుడు ఎవరికి మొక్కాలి అని ఎద్దేవా చేశారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారని విమర్శించారు. చివరకు బజ్జీలు వేసేవాడిని కూడా ఉద్యోగం అని మోదీ చెబుతున్నాడని విమర్శించారు. బీజేపీ నాయకులు పచ్చి మోసాగాళ్లు అంటూ తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు మంత్రి కేటీఆర్. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం డెవలప్మెంట్ లో దూసుకుపోతుందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాకముందు 9 గంటల పవర్ కట్ ఉంటే… తెలంగాణ ఏర్పడ్డాక రైతులకు 24 గంటల విద్యుత్ అందిస్తున్నామని అన్నారు.
ప్రధాని మంత్రి మోదీ చెప్పేవి అన్ని గాలి మాటలే: కేటీఆర్
-