అలాంటి మతాన్నే నేను ఆరాధిస్తా : మంత్రి కేటీఆర్ ట్వీట్

-

భార‌త రాజ్యాంగ నిర్మాత‌, భార‌త‌ర‌త్న డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ 132వ జ‌యంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. రాజకీయ పార్టీలు తమ కార్యాలయాల్లో ఈ వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహాలకు, ఫొటోలకు పూలమాల వేసి నేతలు నివాళులు అర్పిస్తున్నారు. మరికొంత మంది నాయకలు సామాజిక మాధ్యమాల ద్వారా అంబేడ్కర్​ను స్మరిస్తూ.. నివాళులర్పిస్తున్నారు.

తాజాగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి ట్విటర్ వేదికగా అంబేడ్కర్ జయంతి గురించి మాట్లాడారు. భరతజాతికి అంబేడ్కర్ చేసిన సేవలు స్మరిస్తూ నివాళులర్పించారు. స్వేచ్ఛ‌, స‌మాన‌త్వం, సౌభ్రాతృత్వాన్ని బోధించే మ‌తం అంటే తనకు ఇష్ట‌మ‌ని.. అలాంటి మతాన్నే తాను ఆరాధిస్తానని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. భార‌త‌ర‌త్న అంబేడ్కర్ జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌పంచంలోనే అతి పెద్ద అంబేడ్కర్ విగ్ర‌హాన్ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇవాళ ఆవిష్క‌రించ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేస్తున్నాన‌ని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version