BCCపై ఐటీ దాడులు.. వాట్ ఏ సర్ప్రైజ్ అంటూ కేటీఆర్ ట్వీట్

-

బీసీసీ కార్యాలయాలపై ఇవాళ ఐటీ దాడులు జరగడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ స్పందించారు. వాట్ ఏ సర్ప్రైజ్ అంటూ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీపై డాక్యుమెంటరీ ప్రసారం చేసిన కొన్ని వారాలకే బీబీసీ ఇండియాపై ఐటీ దాడులు జరగడం బాధాకరమని తెలిపారు. “WHAT NEXT” అంటూ పేర్కొంటూనే.. అదానీ వ్యవహారంపై రిపోర్ట్​ ఇచ్చిన హిండెన్​ బర్గ్​ సంస్థపై తదుపరి దాడులు ఉంటాయా..! అని ప్రశ్నించారు.

ఐటీ, సీబీఐ, ఈడీ లాంటి కేంద్ర సంస్థలు బీజేపీ చేతిలో కీలుబొమ్మలుగా మారాయని  మంత్రి కేటీఆర్​ ఆరోపించారు. దిల్లీ, ముంబయిలో ఉన్న బీబీసీ కార్యాలయాలపై ఐటీశాఖ దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఆయన స్పందించారు.

అసలేం జరిగిందంటే..  దిల్లీ, ముంబయిలో ఉన్న బీబీసీ కార్యాలయాలపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించింది. ఐటీ శాఖ డైరెక్టర్ జనరల్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. అయితే.. సర్వే మాత్రమే చేస్తున్నామని, సోదాలు చేయట్లేదని ఈడీ అధికారులు స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version