కవిత పై సీబీఐ విచారణ వెనుక కుట్ర దాగి ఉంది : కూనంనేని సాంబశివరావు

-

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ అధికారులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. నేడు హైదరాబాదులో కవిత నివాసానికి చేరుకున్న 11 మంది సభ్యుల సీబీఐ బృందం ఆమెను ప్రశ్నిస్తోంది. బంజారాహిల్స్ లోని కవిత నివాసంలో న్యాయవాదుల సమక్షంలో విచారణ కొనసాగుతోంది. అమిత్ అరోరా వాంగ్మూలం ఆధారంగా కవితను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేస్తున్నారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కవితపై సీబీఐ విచారణ వెనుక కుట్ర దాగి ఉందని ఆరోపించారు. సీబీఐ విచారణ చేస్తున్నట్లుగా లేదని, విచారణ నిష్పక్షపాతంతో చేయాలన్నారు. ఎమ్మెల్యేల కొనుగోళ్లు విఫలం ఆయిన తరువాత ఈడీ, సీబీఐ విచారణ తీవ్రత పెంచారని ఆయన మండిపడ్డారు.

Kunamneni Sambasiva Rao: 30 నియోజకవర్గాలపై ఫోకస్‌.. అసెంబ్లీలో అడుగు  పెట్టాలి..! - NTV Telugu

బండి సంజయ్ వ్యాఖ్యానాలు నిస్సిగ్గు గా ఉన్నాయని, టీఆర్‌ఎస్ లో ఉంటే పుణితం అయినట్లుగా ఉన్నాయని, ప్రతిపక్ష నేతలను బెదిరించి బీజీపీ లోకి వలసలకు ప్రోత్సహిస్తున్నట్లుగా బీజేపీ చర్యలు ఉన్నాయన్నారు. టీఆర్‌ఎస్‌లో ఉన్న వారిని భయ బ్రాంతులకు గురి చేస్తూ, తమ పార్టీ లోకి తెచ్చుకునే ప్రయత్నాలు కనపడుతుందన్నారు. సీబీఐ రావాలంటే రాష్ట్రం అనుమతి తీసుకోవలసి ఉందని, అనుమతి తీసుకోకుండానే ఎలా విచారణ చేస్తారన్నారు. అన్ని రాజ్యాంగ సంస్ధ లను కేంద్రం నిర్వీర్యం చేస్తుందని, బీజేపీకి చెందిన వారి మీద ఇప్పటి వరకు ఈడీ దాడులు ఎంత మంది పై చేశారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వంను ప్రశ్నించే వారిపై దాడులు చేస్తున్నారు. గుజరాత్ లో ఆప్, ఎం ఐ ఎం ను అద్దం పెట్టుకుని గెలిచారని ఆయన మండిపడ్డారు. బీజేపీ పతనం ప్రారంభం అయ్యిందన్నారు కూనంనేని.

Read more RELATED
Recommended to you

Latest news