సీఎం స్టాలిన్ నాకు మద్దతుగా నిలుస్తారని ఆశిస్తున్నా : కుష్బూ

-

బీజేపీకి చెందిన ఖుష్బూ, గాయత్రీ రఘురామ్‌, నమిత , గౌతమి తదితరులను కించపరిచేలా డీఎంకే నేత సాధిక్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వీడియోలో డీఎంకే నేత సైదాయ్ సిద్ధికి ఈ నలుగురిని ఉద్దేశించి ‘రాజకీయాల్లోకి వచ్చిన ఐటెంలు’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల పట్ల డీఎంకే పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమైంది. తమ పార్టీ నేత చేసిన వ్యాఖ్యలకు ఎంపీ కనిమొళి క్షమాపణలు చెప్పారు. అయితే, దీనిపై బీజేపీ నేత కుష్బూ ఇంకా ఆగ్రహంతోనే ఉన్నారు. డీఎంకే నేత వ్యాఖ్యల పట్ల సీఎం స్టాలిన్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. స్టాలిన్ స్పందించకుండా ఉంటే అర్థం ఏంటి? ఆయన మౌనం దేనికి సంకేతం? అని ప్రశ్నించారు కుష్బూ. “ఈ విషయంలో సీఎం స్టాలిన్ నాకు మద్దతుగా నిలుస్తారని ఆశిస్తున్నాను.

Kushboo and the thrill of changing colours- The New Indian Express

కానీ ఆయన ఎందుకు మాట్లాడడంలేదు” అని కుష్బూ నిలదీశారు. అంతేకాదు, అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆ డీఎంకే నేతను వదిలేది లేదని, ఎక్కడికి వెళ్లాలో అక్కడికే వెళతానని హెచ్చరించారు కుష్బూ. సైదాయ్ సిద్ధికిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్టు సంకేతాలు ఇచ్చారు. ఇది తన ఆత్మగౌరవం, మర్యాదలు సంబంధించిన విషయం అని స్పష్టం చేశారు కుష్బూ. అటు, ఐటెంలు అంటూ వ్యాఖ్యానించిన డీఎంకే నేత సైదాయ్ సిద్ధికి క్షమాపణలు తెలిపారు. ఎవరి మనోభావాలు గాయపర్చాలని తాను వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చారు. అయితే, బీజేపీ నాయకత్వం  చేస్తున్న వ్యాఖ్యల పట్ల ఎవరూ ఎందుకు స్పందించరని సిద్ధికి ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news