తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభ వార్త చెప్పింది. భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తులు రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. జీవో నెంబర్ 59 ద్వారా భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తులు విధానాల్లో మార్పులు తీసుకువచ్చింది. మొదటి వాయిదా చెల్లించాల్సిన 12.5 శాతాన్ని దరఖాస్తు సమయంలో చెల్లించాల్సిన అవసరం లేదని రెవెన్యూ శాఖ స్పష్టం చేసింది.
అయితే ప్రాసెసింగ్ రుసుం కింద దరఖాస్తు ఈ సమయంలో వీరు రూపాయలు చెల్లించాల్సి ఉందని పేర్కొంది. 58, 59 జీవోలకు అనుగుణంగా వివాదాలు, సమస్యలు లేని ప్రభుత్వ, యూయెల్సి, ఇతర భూముల క్రమ బద్ధీకరణ కోసం మార్చి నెలాఖరు వరకు అన్ని మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆధార్ కార్డు, ఆ స్థలం తమ ఆధీనంలో ఉన్నట్లు ఏదైనా ఇద్దరూ పత్రం లేదా స్థలం ఫోటోను జతపరచండి దరఖాస్తు చేసుకోవాలని రెవెన్యూ శాఖ స్పష్టం చేసింది. మార్చి 31 వ తేదీ వరకు ఈ దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం