ఎస్బీఐలో స్పెషలిస్ట్ ఉద్యోగాలు..ఇంటర్వ్యూ త్రూ ఎంపిక..

-

ప్రముఖ వాణిజ్య బ్యాంక్ ఎస్బీఐ లో ఉద్యోగం చేయాలని అనుకోనేవారికి గుడ్ న్యూస్.. ఈ బ్యాంక్ లో ఇప్పటికే పలు విభాగాలలో నోటిఫికేషన్ విడుదల చేసింది. కొన్ని పోస్టులు భర్తీ అయ్యాయి.కాగా, తాజాగా మరో కొన్ని పోస్టులకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.భారత ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన ఈ సంస్థ సెంట్రల్‌ రిక్రూట్‌మెంట్ అండ్‌ ప్రమోషన్‌ విభాగంలో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు.ఈ ఖాళీలను రెగ్యులర్‌ ప్రాతిపాదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఖాళీ ఉన్న పోస్టులు, అర్హతలు..

నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 14 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుని అనుసరించి సీఏ/ సీఎఫ్‌ఏ/ ఎంబీఏ/ పీజీడీఎం/ ఎమ్మెస్సీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. వీటితో పాటు సంబంధిత పనిలో అనుభవం, టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

అభ్యర్థుల వయసు 40 ఏళ్లు మించకూడదు.

అభ్యర్థులను తొలుత విద్యార్హతలు, అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 100 మార్కులకు నిర్వహించే ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తుల ప్రక్రియ 27-05-2022న మొదలుకాగా చివరి తేదీగా 16-06-2022ని నిర్ణయించారు.

బ్యాంక్ ఉద్యోగాలు చేయాలనీ అనుకున్న వాళ్ళు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లై చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news