కొడుకు కెరీర్ ను రిస్క్ లో పెడుతున్న నాగబాబు..!

-

సాధారణంగా మెగా ఫ్యామిలీ లో ఉన్న ప్రతి ఒక్కరు ఎంతో వైభవంగా జీవితాన్ని గడుపుతున్నారో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ముఖ్యంగా వారు చేపట్టే ఏ పని అయినా సరే విజయవంతంగా సక్సెస్ అవుతుంది. కానీ ఒక్క నాగబాబు విషయంలో మాత్రం ఇందుకు పూర్తిగా విరుద్ధం అని చెప్పవచ్చు. అంతే కాదు మెగా ఫ్యామిలీ లో అత్యంత దరదృష్టవంతుడు కూడా నాగబాబు కావడం గమనార్హం. ఇకపోతే టాలీవుడ్ రారాజుగా గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి సైతం నాగబాబు తలరాతను మార్చే లేకపోయాడు. నాగబాబు దురదృష్టవంతుడు అని నిరూపించడానికి 1990లలో చిరంజీవి డేట్స్ దొరికితే చాలు జాక్పాట్ కొట్టినట్లే అని నిర్మాతలు భావించే వాళ్ళు.. అలా నిర్మాతలకు ఆయన సినిమా లాభాల పంట కురిపించేది.Nagababu reacted on a recent rumour - Varun Tej Marriage !!

ఇక అలా హీరోగా ఎదగాలనుకున్న నాగబాబు సక్సెస్ కాకపోవడంతో నిర్మాత అవతారం ఎత్తి.. తల్లి పేరు మీద అంజనా ప్రొడక్షన్స్ స్థాపించి రుద్రవీణ సినిమాకు ప్రొడ్యూసర్ గా పనిచేశారు. అయితే ఈ సినిమా కమర్షియల్గా ఆడలేదు. ఇక ఆ తర్వాత త్రినేత్రుడు, ముగ్గురు మొనగాళ్లు సినిమాలు కూడా నాగబాబుకి అదృష్టాన్ని కలిగించలేదు . ఇక 1998 లో వచ్చిన బావగారు బాగున్నారా సినిమా మాత్రమే హిట్ టాక్ ను తెచ్చుకుంది. పవన్ కళ్యాణ్ తో నాగబాబు నిర్మాతగా గుడుంబా శంకర్ సినిమాలు కూడా నిరాశ పరిచాయి.

ఇక రామ్ చరణ్ తీసిన ఆరెంజ్ సినిమా కి కూడా నాగబాబు నిర్మాతగా వ్యవహరించారు. ఇక ఈ సినిమాతో ఏకంగా ఆస్తులు అమ్ముకొని రోడ్డున పడ్డాడు నాగబాబు . అయినా కూడా పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేసి అల్లు అర్జున్ తో నా పేరు సూర్య సినిమా నిర్మాతగా బాధ్యతలు చేపట్టారు. ఈ సినిమా కూడా డిజాస్టర్ గా మిగిలింది. చిరంజీవి, పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్ , అల్లు అర్జున్ వల్ల కాలేదు.. ఇప్పుడు మరొకసారి తన కొడుకును రంగంలోకి దింపడానికి సిద్ధమయ్యాడు నాగబాబు. ఇప్పుడే కెరియర్లో ఒక్క అడుగు వేసుకుంటూ ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు వరుణ్ తేజ్.కొడుకు వరుణ్ కెరీర్ కి నాగబాబు కొరివి... చిరు, బన్నీ, చరణ్ వల్లే కాలేదు పసివాడు తట్టుకోగలడా!

ఇక వరుణ్ తేజ్ భవిష్యత్తును కూడా ఇరకాటంలో పెట్టబోతున్నాడు నాగబాబు. ఈ సారి తన సొంత కొడుకు పైనే తన సెంటిమెంట్ ప్రయోగించడానికి సిద్ధమయ్యాడు. వరుణ్ తేజ్ నెక్స్ట్ మూవీ కి నాగబాబు నిర్మాతగా భాగస్వామి అవుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి . ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీని తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఈ సినిమాకు బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ పాటు నాగబాబు కూడా నిర్మాణంలో భాగంగా ఉన్నారు. మరి నాగబాబు పెట్టను కనీసం వరుణ్ తేజ్ అయినా తీరుస్తాడు లేదో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news