గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీ పై లేటెస్ట్ అప్డేట్స్;.. నోటిఫికేషన్ వివరాలు..

-

తెలంగాణాలో ఇప్పటికే ఉద్యోగాలకు సంబందించిన వరుస నోటిఫికేషన్ లను విడుదల చేస్తూ వస్తున్నారు. ఇటీవల గ్రూప్ 1 కు సంబందించిన పొలిసు నియామకాల నోటిఫికేషన్ ను కూడా విడుదల చేసారు. వాటికి దరఖాస్తుల ప్రక్రియ కూడా ముగిసింది. అయితే అర్హత ఉన్నా.. గ్రూప్ 1 ఉద్యోగాలు సాధించడం కాస్త కష్టమే అనిపించిన కొందరు నిరుద్యోగులు తదుపరి నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నారు.

అందులో ముఖ్యంగా గ్రూప్ 4 కొలువులు. 9వేలకు పైగా ఖాళీలు ఉన్నాయి. సీఎం కేసీఆర్ మార్చి నెలలో అసెంబ్లీ సాక్షిగా భర్తీ చేయనున్న ఖాళీల వివరాలను వెల్లడించారు. ఆరోజు నుంచి కూడా ఖాళీ పోస్టులను గుర్తించి ఆర్థిక శాఖకు వివిధ శాఖల అధికారులు పంపిస్తున్నారు. అనుమతి పొంది నోటిఫికేషన్ కు సిద్ధంగా ఉన్న పోస్టులల్లో గురుకులాలకు సంబంధించినవి 10వేలకు పైగా ఉన్నాయి. వీటిని అతి త్వరలో భర్తీ చేయనున్నారు.

గత నెల మేలో సీఎస్ సోమేష్ కుమార్ ఆధ్వర్యంలో పలు శాఖల అధికారులతో గ్రూప్ 4 కొలువులపై సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. మే 29లోగా అన్ని ఖాఖల ఖాళీల జాబితాను టీఎస్పీఎస్సీకి అందిచాలని కోరారు. అయితే వాటి ఖాళీ వివరాలను కొన్ని కారణాల కారణంగా వివిధ శాఖల అధికారులు సమరర్పించలేకపోయారు. కొన్ని శాఖల నుంచి ఖాళీల వివరాలు వచ్చినా.. అవి అస్పష్టంగా ఉండటంతో తిరిగి వెనక్కి పంపించేశారు.కొన్ని కారణాల వల్ల నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు.

ఇప్పుడు ఈ నోటిఫికేషన్ కు సంబందించిన మరి అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం లెక్కల ప్రకారం ఆఫ్ ది రికార్డ్ గా గ్రూప్ 4లో 20వేలకు పైగా ఖాళీలు ఉన్నట్లు తేలింది. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఖాళీలుగా పరిగణించకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని సమాచారం. ఈ నెలాఖరు వరకు కూడా ఈ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు లేనట్లే తెలుస్తోంది. జూలై 31లోగా జాబితాలు కమిషన్ కు అందిస్తే.. వాటిని పరిశీలించి అన్ని శాఖల నుంచి క్లారిటీ తీసుకుంటుందని టీఎస్పీఎస్సీ అధికారులు చెబుతున్నారు. దీంతో ఈ నోటిఫికేషన్ ఆగస్టు చివరలో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news