తెలంగాణ విద్యార్థులకు మరో అప్డేట్.. ఎగ్జామ్స్ తేదీలు విడుదల..

-

తెలంగాణ లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎన్నో పరీక్షలు వాయిదా పడ్డాయి.. ఎంసెట్ పరీక్షలు కూడా వాయిదా పడిన విషయం తెలిసిందే.. కొత్త తేదీలను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి తాజాగా విడుదల చేసింది.ఈ నెల 30, 31 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఆగస్టు1న ఈసెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించింది. వాస్తవానికి ఈ పరీక్ష ఈ నెల 14, 15 తేదీల్లో జరగాల్సి ఉంది. కానీ భారీ వర్షాల నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేసింది ఉన్నత విద్యామండలి.

ఎంసెట్ ఇంజనీరింగ్ కు సంబంధించిన పరీక్షలను మాత్రం షెడ్యూల్ ప్రకారమే ఈ నెల 18, 19, 20 తేదీల్లో నిర్వహిస్తోంది. తాజాగా వాయిదా పడిన అగ్రికల్చర్ ఎంసెట్ కు సంబంధించిన తేదీలను తాజాగా విడుదల చేసింది ఉన్నత విద్యామండలి. పీజీఈసెట్ పరీక్షలను ఆగస్టు 2 నుంచి 5వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి అధికారులు తెలిపారు.ఇక ఇంటర్ పరీక్షలు కూడా వాయిదా పడిన విషయం తెలిసిందే..

విద్యార్థులు ఫీజు కట్టడంలో ఇబ్బందులు ఎదురైన వారికి మరో అవకాశం కల్పించారు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు . తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లించేందుకు మరో రెండు రోజులు అవకాశం ఇచ్చారు. ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షలు, ఇంటర్ ఫెయిలైన విద్యార్థులు ఈ నెల 18 మరియు 19వ తేదీల్లో రూ. 200 ఫైన్ తో ఫీజు చెల్లించవచ్చని ఓ ప్రకటన విడుదల చేశారు… దానికి మంచి స్పందన వచ్చింది.చాలా మంది విద్యార్థులు అప్లై చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news