కోట్ల స్కాం…బాలీవుడ్‌ హీరోయిన్‌ అరెస్ట్‌…!

-

200 కోట్ల మోసం కేసులో జైళ్లో ఉన్న సుకేశ్‌ చందశేఖర్‌ ఫ్రెండ్‌ లీనా మరియా పాల్‌ ను తాజాగా ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. 2013 ఏడాదిలో తన ప్రియుడితో కలిసి ఓ బ్యాంకును మోసం చేసిన కేసులో అరెస్ట్‌ కాగా.. మరోసారి 2015 లో అరెస్ట్‌ అయ్యారు. లీనా… జాన్‌ అబ్రహంతో కలిసి మద్రాస్‌ కేఫ్‌ లో నటించింది. ఇంకా అనేక బాలీవుడ్‌ సినిమాల్లో లీనా నటించి మంచి విజయాలు సాధించింది.

200 కోట్ల స్కామ్‌ లో లీనా పాత్ర కూడా ఉందన్న నేపథ్యం లో ఆమె ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. సుకేశ్‌… జైలు లో ఉండి… లీనాతో అన్ని వ్యవహరాలు నడిపిస్తున్నాడు. సుకేశ్‌ సుమారు 200 కోట్ల మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పలు బ్యాంకులు మరియు ఇతర స్కాంల్లో భాగంగా సుకేష్‌ ను గతంలో అరెస్ట్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం సుకేష్‌ తీహార్‌ జైలు లో ఉన్నాడు. అయితే… తాజాగా సుకేష్‌ తో లీనా కు సంబంధాలు ఉండటంతో ఆమెను అరెస్ట్‌ చేశారు. ఇక కేసు విషయాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version