తిరుపతిలో చిరుతల సంచారం భయాందోళనకు గురి చేస్తోంది. ఇటీవల తిరుమలలో చోటు చేసుకుంటున్న ఘటనలు భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవలే ఓ చిన్నారిని సైతం తిరుపతిలో చిరుత బలితీసుకుంది. అనంతరం రంగంలోకి దిగిన అటవీశాఖ సిబ్బంది చిరుతను బంధించారు. దీంతో చిరుత భయం తప్పిందనుకునేలోపు మరో మూడు చిరుతలు ఉన్నాయన్న వార్త భయాందోళన కలిగిస్తోంది. ఇంతలో ఎలుగుబంటి శ్రీవారి మెట్టు మార్గాన ప్రత్యక్షమవ్వడం మరింత భయాందోళనకు దారి తీసింది. ఇంతలో తిరుపతి ఎస్వీ యూనివర్సిటి కళాశాల వద్ద చిరుత సంచారం విద్యార్థులను హడలెత్తిస్తోంది.
ఆదివారం రాత్రి ఇంజినీరింగ్ కళాశాలలో చిరుత కనిపించింది. దీంతో కళాశాలకు చెందిన విద్యార్థులు భయభ్రాంతులకు గురవుతున్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా చిరుతలు ఇలా కళాశాల సమీపంలో, ఎన్సీసీ గేట్ వద్ద దర్శనమివ్వడం తలచుకుని భయపడిపోతున్నారు. గత కొంత కాలంగా ఎస్వీ యూనివర్సిటీలో పులులు సంచారం అత్యధికంగా ఉందని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.కొచ్చిన పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆందోళన చేపడుతున్నారు.