లేగదూడను ఎత్తుకెళ్లి చంపి తిన్న చిరుత.. భయాందోళనలో జనం

-

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం  కొత్తపల్లిలో చిరుతపులి జనాలను భయాందోళనకు గురిచేసింది. ఒక లేగదూడను ఎత్తుకెళ్లి చంపి తిన్నది ఆ చిరుత. గ్రామానికి చెందిన రైతు అజ్మీరా మోతీలాల్‌ నాయక్‌ ఆవులను పెంచుతాడు. రోజు లాగానే గ్రామ శివారులోని తన పొలం వద్ద ఆదివారం రాత్రి రెండు ఆవులను, లేగదూడను కట్టేసి, మేత వేసి ఇంటికి వచ్చాడు ఆ రైతు. సోమవారం తెల్లవారు జామున ఎదో ఒక వన్య మృగం దాడి చేసి లేగదూడను సమీప కర్రెగుట్టలోకి లాక్కెళ్లి చంపి తిని కళేబ‌రాన్ని అక్కడే వదలి వేసి వెళ్లింది.

అతను ఎప్పటిలాగే తన పొలం దగ్గరకు వెళ్లగా లేగదూడ కనించలేదు. దీంతో ఆందోళన చెందిన రైతు దాని అచూకీ కోసం వెతుకుతూ వెళ్లాడు. లేగదూడను లాక్కెళ్లినట్లుగా అనవాళ్లు, జంతు పాదముద్రలు కనిపించాయి. వాటిని గమనిస్తూ రైతు కర్రెగుట్టకు వెళ్లగా అక్కడ లేగదూడ కళేబ‌రం కనిపించింది.

అయితే, వెంటనే గ్రామానికి వచ్చి ఫారెస్ట్‌ అధికారులకు సమాచారం ఇచ్చాడు. దీంతో ఫారెస్ట్‌ డిప్యూటీ రేంజి అధికారి సీహెచ్‌ స్వాతి, ధర్మారం ఎఫ్‌బీవో ఎం స్వాతి కలిసి ఘటనా స్థలానికి వెళ్లి పంట చేలల్లో కనిపించిన పాదముద్రలను పరిశీలించారు. అవి చిరుతపులి పాదముద్రలేనని వారు స్పష్టం చేశారు. ఈ నేపధ్యం లో ఫారెస్ట్‌ డిప్యూటి రేంజర్‌ స్వాతి మాట్లాడుతూ రైతులు అప్రమత్తంగా ఉండాలని, పొలాలకు గుంపులుగా కర్రలు, గొడ్డండ్లతో వెళ్లాలని ఆదేశించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version