‘లెటర్’ పాలిటిక్స్: ఫ్యామిలీ మొత్తం అదే పనిలో ఉందిగా!

-

రాష్ట్రంలో సమస్యలు ఏమి లేనట్లు…అసలు కేంద్రం వల్లే అన్నీ సమస్యలు వస్తున్నట్లు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఎప్పుడైతే రాష్ట్రంలో బీజేపీ పుంజుకుందో అప్పటినుంచి టీఆర్ఎస్ వైఖరి మారింది. రాష్ట్రంలో తమని బీజేపీ టార్గెట్ చేయడంతో, టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుంది. రాష్ట్రంలో ఉన్న ప్రజా సమస్యలపై బీజేపీ గళం విప్పుతుంటే, టీఆర్ఎస్ మాత్రం కేంద్ర ప్రభుత్వం వల్లే రాష్ట్రానికి సమస్యలు అన్నట్లు చూపించడానికి ప్రయత్నిస్తుంది.

ఈ మధ్య ఏంటో కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం ఒకటే అనుకుని, వరుసపెట్టి కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ లెటర్లు రాస్తున్నారు. ఇంకా రాష్ట్రంలో ఏ సమస్యలు లేనట్లు…కేంద్రాన్ని టార్గెట్ చేసి కేటీఆర్, కేసీఆర్, హరీష్, కవితలు హడావిడి చేస్తున్నారు. ఇటీవలే కేటీఆర్, కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. రాష్ట్రంలో పారిశ్రామిక మౌలిక వసతుల కల్పనకు కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని కోరారు.

ఇక తాజాగా కేసీఆర్, హరీష్‌లు సైతం లేఖస్త్రాలు సంధించారు. వివిధ పద్దుల కింద రాష్ట్రానికి రూ.3,145.81 కోట్లు రావాల్సి ఉందని, వీటిని విడుదల చేయాలని హరీష్ రావు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ని లేఖలో డిమాండ్‌ చేశారు. అటు సీమే కేసీఆర్, ప్రధాన మంత్రి మోడీకి లేఖ రాశారు. అసలు రాష్ట్రాల అనుమతి లేకుండానే ఐఏఎస్‌ అధికారులను డెప్యుటేషన్‌ మీద కేంద్ర ప్రభుత్వ సేవలకు తీసుకెళ్లేందుకు క్యాడర్‌ రూల్స్‌ను సవరించే ప్రయత్నాన్ని కేసీఆర్‌ తప్పుబట్టారు. ఇది కేంద్ర, రాష్ట్రాల సంబంధాలను దెబ్బ తీస్తుందని, ఇలాంటి ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఇలా ఈ ముగ్గురు నేతలు లేఖలు రాస్తే…తాను కూడా ఏదొకటి డిమాండ్ చేయాలని అనుకున్నారేమో గాని వెంటానే కవిత సైతం…బండి సంజయ్‌ని టార్గెట్ చేశారు. మేడారం జాతరకు జాతీయ హోదా తెచ్చి, ప్రత్యేక నిధులు కేటాయించాలని ఎంపీ బండి సంజయ్‌ని డిమాండ్ చేశారు. ఇలా ఫ్యామిలీ మొత్తం బీజేపీపై పడింది.

Read more RELATED
Recommended to you

Latest news