అదిరే LIC పాలసీ.. ఈ కొత్త పాలసీతో ఆర్ధిక ఇబ్బందులు పరార్…!

-

చాలా మంది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అందించే పాలసీలను తీసుకుంటూ వుంటారు. నిజానికి LIC వలన ఎన్నో లాభాలు ఉంటాయి. పైగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు సరికొత్త ప్లాన్స్ ని తీసుకు వస్తూనే ఉంటుంది. వీటి వలన వయసు మళ్లిన తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా చూడచ్చు.

ఇక ఇది ఇలా ఉంటే తాజాగా LIC ఓ కొత్త పాలసీని తీసుకు వచ్చింది. అదే న్యూ పెన్షన్ ప్లస్. దీని వలన రిటైర్‌మెంట్ సమయంలో రెగ్యులర్ ఆదాయ ప్రయోజనాలు పొందొచ్చు. నాన్-పార్టిసిపేటింగ్, యూనిట్ లింక్డ్ ఇండివిడ్యువల్ పెన్షన్ ప్లాన్ ఇది. దీనిలో పొదుపు చేస్తే పెద్ద మొత్తంలో కార్పస్‌ను ఏర్పాటు చేసేందుకు అవుతుంది.

పాలసీ టర్మ్‌ ముగిసే నాటికి యాన్యుటీ ప్లాన్‌ను కొంటె రెగ్యులర్ ఆదాయంగా మార్చచ్చు. ఈ ప్లాం లో మీరు ఒకేసారి ప్రీమియాన్నిచెల్లించచ్చు లేదా రెగ్యులర్‌గా ప్రీమియం పేమెంట్లతో కూడా పాలసీ తీసుకోవచ్చు. ఏది ఎంచుకోవాలి అనేది పాలసీదారుడి ఇష్టం. నాలుగు రకాల ఫండ్స్‌లో ప్రీమియాన్ని పెట్టుబడి పెట్టుకునే అవకాశం ఉంటుంది.

ప్రతీ వాయిదాపై ప్రీమియం అలాకేషన్ ఛార్జీలను ఎల్ఐసీ విధిస్తుంది. యాక్టివ్ పాలసీ కిందన.. యాన్యువల్ ప్రీమియంలో కొంత భాగాన్ని గ్యారెంటీడ్ అడిషన్స్ చెల్లిస్తుంది. ప్రీమియం చెల్లింపులపై 5 శాతం నుంచి 15.5 శాతం లో వుంది. సింగిల్ ప్రీమియాలపై 5 శాతం వరకు ఉంటాయి. సెలెక్ట్ చేసుకున్న ఫండ్స్ కి అనుగుణంగా యూనిట్ల కొనుగోలుకు పాలసీదారుడు వాడచ్చు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news