“LIKE SHARE SUBSCRIBE ” టీజర్ రిలీజ్ !

-

టాలీవుడ్ హీరో సంతోష్ శోభన్, జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా నటిస్తున్న చిత్రం ” లైక్ షేర్ సబ్స్క్రైబ్”. విభిన్న కథలను ఎంచుకుంటూ తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు నటుడు సంతోష్ శోభన్. ” గోల్కొండ హై స్కూల్” చిత్రంతో గౌతమ్ గా కెరియర్ ని ప్రారంభించాడు సంతోష్. ” తను నేను” అనే చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు.

ఆ తర్వాత ఏక్ మినీ కధ చిత్రంతో మొదటి బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించాడు. ప్రస్తుతం మేర్లపాటి గాంధీ దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ” లైక్ షేర్ సబ్స్క్రయిబ్”. ఈ చిత్రంలో జాతీ రత్నాలు సినిమాలో చిట్టి పాత్రలో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు.

అడ్వెంచరస్ ట్రావెల్ ఎంటర్టైనర్ గా తెరకేక్కుతున్న ఈ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనన వచ్చింది. తాజాగా మేకర్స్ ఈ మూవీ టీజర్ ని లాంచ్ చేశారు. సంతోష్ శోభన్ ట్రావెలర్ గా కనిపిస్తుండగా.. అతడి ప్రయాణంలో పరిచయమయే యువతిగా ఫరియా అబ్దుల్లా నటిస్తోంది. ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ తో పాటు క్యూరియాసిటీని పెంచే ఏదో అంశం చుట్టూ సినిమా సాగనున్నట్టు టీజర్ లో తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version