లోన్ యాప్స్ బరి తెగిస్తున్నాయి. అత్యవసరాలకు డబ్బులు తీసుకున్న వారి ఉసురు తీస్తున్నాయి. ఇప్పటికే ఇలాంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో జరిగాయి. అప్పులు తీసుకున్న పాపానికి బాధితులును మానసికంగా వేధించడంతో పాటు వారి పరువును బజారుకీడుస్తున్నారు. ఎక్కడా లేని విధంగా వడ్డీలు విధిస్తూ అరాచకాలు సాగిస్తున్నారు. సకాలంలో అప్పు తీర్చకపోతే వెంటనే.. బాధితుడి బంధువులకు ఫోన్లు చేయడం వంటి చేస్తూ.. బాధితుడి పరువుల పోయేలా చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు తిడుతూ.. బెదిరిస్తూ యాప్ నిర్వహకులు, ఆత్మహత్యలు చేసుకునేలా ప్రేరేపిస్తున్నారు. వేధింపులు తాళలేక, పరువు పోయిందని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా లోన్ యాప్స్ వేధింపులకు మరో యువకుడు తనువు చాలించాడు. వేధింపులు తాళలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెన్నాపురం సాయి గణేష్ కాలనీలో చోటు చేసుకుంది. వేధింపులతో 23 ఏళ్ల మహ్మద్ ఖాజా ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ తరలించారు.