ఈ ప్రభుత్వ స్కీమ్ తో.. రూ.10 లక్షల నుంచి రూ.1 కోటి వరకు లోన్…!

-

మీరు ఏదైనా బిజినెస్ ని స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇలా మీరు లోన్ ని పొందవచ్చు. ఇలా పెట్టుబడి ని పెట్టి చక్కగా వ్యాపారం చేసేయచ్చు. చాలా మంది బ్యాంకుల చుట్టూ తిరిగి తిరిగి విసిగి పోతూ వుంటారు. మీరూ లోన్ కోసం తిరిగీ తిరిగీ విసిగిపోయారా..? అయితే ఈ కేంద్ర ప్రభుత్వ స్కీమ్ గురించి చూడాల్సిందే. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందినవారితో పాటు మహిళలకు కేంద్రం ఈ స్కీము ద్వారా లోన్స్ ని ఇస్తోంది. ఇక దీని కోసం పూర్తి వివరాలు చూద్దాం.

స్టాండ్‌అప్ ఇండియా స్కీమ్ పేరు తో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందినవారితో పాటు మహిళలకు కూడా లోన్స్ ని ఇస్తోంది. ఏడేళ్ల క్రితం ప్రారంభమైన స్కీమ్ ఇది. వ్యాపారాలు చేయాలనుకునే వారికి రుణాలు ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. చాలా మంది ఈ స్కీమ్ కింద లోన్ ని తీసుకుంటున్నారు. రూ.10 లక్షల నుంచి రూ.1 కోటి వరకు రుణాలు పొందొచ్చు. 18 ఏళ్లు దాటితే ఈ స్కీమ్ బెనిఫిట్స్ ని పొందవచ్చు. ఇక ఈ స్కీమ్ ద్వారా ఎలా లోన్ ని పొందాలో చూసేద్దాం.

ముందు https://www.standupmitra.in/ వెబ్‌సైట్‌ ని ఓపెన్ చేసేయండి.
Apply Here అనే దాని పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీకు ఓ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
New Entrepreneur, Existing Entrepreneur, Self Employed Professional ఆప్షన్స్‌ ఉంటాయి. ఒక దాన్ని ఎంచుకోవాలి.
పేరు, ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఓటీపీ జనరేట్ చేయాలి.
ఓటీపీ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ ఫామ్ ని నింపాలి.
వ్యాపారం వివరాలు, లోన్ వివరాలు ని కూడా ఎంటర్ చేయాలి. అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి లోన్ కోసం అప్లై చేయాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version