కరోనా వైరస్ నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు ఏడు సూచనలు చేసారు. మే 3 వరకు దేశ వ్యాప్త లాక్ డౌన్ ఉంటుందని ఆయన జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రకటించారు. ప్రజలు అందరూ కూడా మే 3 వరకు ఇళ్ళల్లోనే ఉండాలని సూచించారు. కరోనాపై భారత్ యుద్ధం కొనసాగుతుందని చెప్పారు మోడీ. కరోనా హాట్ స్పాట్ ల మీద ప్రత్యేక దృష్టి పెడతామని ఆయన వివరించారు.
లాక్ డౌన్ పై మోడీ ఏడు సూచనలు;
1. సీనియర్ సిటిజన్స్‌ను జాగ్రత్తగా కాపాడుకోవాలి.
2. మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలి. సామాజిక దూరం ఖచ్చితంగా పాటించాలి.
3. అత్యవసర విధుల్లో ఉన్న వారిని గౌరవించాలి.
4. పేదలకు అండగా ఉండాలి.
5. రోగ నిరోధక శక్తి పెంపొందించే ఆహారం తీసుకోవాలి.
6. ఆరోగ్య సేతు యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
7. ప్రయివేటు సంస్థలు ఉద్యోగులను విధుల నుంచి తొలగించవద్దు.