తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు కష్టపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు..ఇటు జనాల్లో తిరుగుతున్నారు. బాబు పర్యటనలకు జనాల నుంచి మంచి స్పందనే వస్తుంది. అదే సమయంలో బాబుకు తోడుగా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి లోకేష్ సైతం..పాదయాత్ర చేయడానికి రెడీ అయ్యారు. దీనికి యువగళం అని పేరు పెట్టారు.
అయితే యువ నాయకుడైన లోకేష్ ప్రజల తరుపున గళం వినిపిస్తారు కాబట్టి..యువగళం అని పేరు పెట్టినట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. సరే పేరు ఏదైనా గాని..మళ్ళీ టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా లోకేష్ పాదయాత్ర సాగనుంది. 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్లు ఈ పాదయాత్ర సాగనుంది. 100 నియోజకవర్గాల్లో కుప్పం టూ ఇచ్చాపురం వరకు పాదయాత్ర ఉంటుంది. అయితే లోకేష్ పాదయాత్రకు కొన్ని చిక్కులు ఉన్నాయి. గతంలో టీడీపీ ప్రభుత్వంలో జగన్ పాదయాత్రకు ఎలాంటి ఇబ్బందులు రాలేదు..టీడీపీ ఎక్కడా కూడా అడ్డుకునే కార్యక్రమాలు చేయలేదు.
కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ లోకేష్ పాదయాత్రని అడ్డుకునే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే పలు విధాలుగా టీడీపీ కాయక్రమాలని వైసీపీ అడ్డుకుంటూ వచ్చింది. అటు అమరావతి రైతుల పాదయాత్రకు పోటీ వైసీపీ శ్రేణులు ర్యాలీలు చేసి..గొడవ జరిగేలా చేసి అడ్డుకుందనే ఆరోపణలు ఉన్నాయి. మరి రేపు లోకేష్ పాదయాత్రలో ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉంటే లోకేష్ పాదయాత్ర 400 రోజులు సాగనుంది. జనవరి 27 2023 నుంచి దాదాపు 2024 మార్చి వరకు సాగుతుంది. అంటే ఎన్నికల ముందు వరకు. ఒకవేళ జగన్ ముందస్తుకు వెళితే..అప్పుడు పాదయాత్ర ఆపేయాల్సిందే. ముందస్తుకు వెళితే 2023 మే లేదా జూన్ లో ఎన్నికలు ఉంటాయని అంటున్నారు. లేదా 2023 చివరిలో. మరి చూడాలి ముందస్తు ఉంటుందో లేదో.