నేటికాలంలో ఇయర్ ఫోన్స్ వాడటం అనేది సర్వసాధారణం గా మారిపోయింది. నడుస్తున్న, బందిమీద వెళ్తున్న, ట్రైన్లో వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా ఏ పని చేస్తున్నా ప్రతిఒక్కరి చెవిలోను ఇయర్ ఫోన్స్ తో చూస్తున్నాం. వాటిని చెవిలో పెట్టుకుని ఇక పక్కవారిని పట్టించుకునే స్థితిలో ఉండటం లేదు ఎవరూ కూడా.అయితే ఇలా ఎక్కువ సేపు ఇయర్ ఫోన్స్ పెట్టుకోవటం వలన కలిగే సమస్యలు ఏమిటో తెలుసుకుందాం.
మంచి సంగీతం లేదా పాటలు ఆస్వాదించడానికి ఇయర్ ఫోన్స్ ఉపయోగించినప్పుడు ప్రత్యక్షంగా ఆడియో చెవుల మీద ప్రభావం చూపుతుంది. 90 డెసిబెల్ల వాల్యూమ్ ఉంటే కనుక తీవ్రమైన వినికిడి సమస్యలు ఉంటాయి. ఇయర్ ఫోన్స్ వాడేటప్పుడు ఒక మోస్తరు పరిమాణంతో సంగీతాన్ని వినాలి. అప్పుడు వినికిడి సమస్య రాకుండా ఉంటుంది. ఇయర్ ఫోన్స్ వాడటం కారణంగా గాలి మార్గం బ్లాకింగ్ అయ్యి చెవికి ఇన్ ఫెక్షన్ వచ్చి హాని కలుగుతుంది.
వీటిని ఎక్కువగా ఉపయోగించటం వలన గులిమి ఎక్కువగా ఏర్పడి చెవి హోరుకు కారణం కావచ్చు. వీటిని ఉపయోగించటంలో గోప్యత పాటించాలి. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి హెడ్ ఒకరు వాడినవి మరొకరు వాడకూడదు. మరొకరు వాడిన ఇయర్ ఫోన్స్ మీరు ఉపయోగించాల్సి వస్తే వాటిని శుభ్రపరచాలి. సుదీర్ఘ కాలం పాటు ఇయర్ ఫోన్స్ ఉపయోగిస్తే శాశ్వత వినికిడి సమస్యలకు దారితీస్తుంది.
ఇయర్ ఫోన్లు విడుదల చేసే విద్యుదయస్కాంత తరంగాలు దీర్ఘకాలంలో మెదడు సమస్యలకు కారణం కావచ్చు. ఎందుకంటే లోపలి చెవి మెదడుతో సంబంధం కలిగి ఉంటుంది. దీంతో ఇన్ఫెక్షన్ కలిగి మెదడు మీద ప్రభావం చూపిస్తుంది. ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వాడటం వలన ప్రతికూల పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది. షాపింగ్, వాకింగ్, బయట జాగింగ్ చేసేటప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే బయట సౌండ్స్ వినబడవు. బండి మీద వెళ్ళేటప్పుడు కూడా వీటిని ఉయోగిస్తున్నారు. వీటి కారణంగా ఈ మధ్య రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి.