జామ ఆకులతో బోలెడు లాభాలు..ఎలా అంటే..?

-

జామ ఆకులలో ఎన్నో రకాలైన ప్రయోజనాలు ఉన్నాయి. విటమిన్ సి,ఫైబర్,పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్నాయి. అందువలన జామ ఆకులలో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు ఎక్కువగా ఉన్నాయి. జామ ఆకులను ఆయుర్వేదంలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు. జామ ఆకుల యొక్క ప్రయోజనాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

పంటి నొప్పి ఉన్నవారు ప్రతిరోజు జామ ఆకుల కషాయాన్ని పుక్కలించడం వలన మంచి ఫలితం లభిస్తుంది.జలుబు, దగ్గు, అజీర్తి కి జామ ఆకుల టీ తాగడం వలన వెంటనే వాటి నుంచి ఉపశమనం కలుగుతుంది.మధుమేహం ఉన్నవారికి ఈ జామ ఆకులు మరియు జామకాయలు చాలా బాగా పనిచేస్తాయి. జామ ఆకులు కషాయాన్ని ప్రతిరోజు తీసుకోవడం వలన షుగర్ వ్యాధి ని అదుపు లో ఉంచుతుంది.జామ ఆకులలో ఉండే అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మృదువుగా ఉంచడంలో సహాయపడతాయి. జామ ఆకుల టీ ని ప్రతిరోజు తీసుకోవడం వల్ల మన చర్మం మీద ఉన్న మొటిమలు మరియు మచ్చలు తగ్గుముఖం పడుతాయి.

జామ ఆకులలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అధిక బరువు ఉన్నవారు ప్రతిరోజు జామ ఆకుల కషాయాన్ని తీసుకోవడం వలన వారి బరువుని తగ్గించుకొనవచ్చు. లేత జామ ఆకులలో టానిక్ మరియు ఆక్సలైడ్లు ఎక్కువగా ఉంటాయి . అందుచేత నోటి పూత, చిగుళ్ల వాపు, గొంతు నొప్పి ఉన్నవారు జామ ఆకులను
నమలడం లేదా జామ ఆకుల కషాయాన్ని పుక్కలించడం వలన వెంటనే ఉపశమనం పొందవచ్చు.
జామ ఆకులను నేరుగా లేదా జామ కషాయాన్ని తీసుకోవడం వలన అది మన శరీరంలోనే చెడు కొలెస్ట్రాలను తగ్గించి శరీరంలో రక్తం అన్ని అవయవాలకు సక్రమంగా అందేలా చూస్తుంది. అందువల్ల గుండె సంబంధిత వ్యాధులు చాలా తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.

కాబట్టి తప్పనిసరి గా విరివిగా లభించే జామ ఆకుల ఉపయోగాలను పొందండి. ఖర్చు తక్కువ ప్రయోజనం ఎక్కువ..

Read more RELATED
Recommended to you

Latest news