వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్..ఆ కాల్స్ ను కూడా..

-

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ లో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతున్నారు.. ఇప్పుడు మరో ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.. అదే కాల్స్‌కు నోటిఫికేషన్స్‌ను డిజేబుల్ చేయడం. కాల్ నోటిఫికేషన్లను కూడా మ్యూట్ చేసేందుకు ఇది వినియోగదారులను అనుమతించనుంది. ఎప్పుడైనా బిజీగా ఉన్నప్పుడు కాల్ నోటిఫికేషన్స్‌తో డిస్టర్బ్ కాకుండా ఉండవచ్చు.

కొన్ని సార్లు వాట్సాప్ డీఎన్‌డీ ఫీచర్ కూడా టెక్నికల్ గ్లిచెస్ కారణంగా ఫెయిల్ అవ్వచ్చు. అప్పుడు ఈ ‘Disable Notifications for Calls’ ఫీచర్ ఉపయోగపడనుంది. WaBetaInfo కథనం ప్రకారం విండోస్ 2.2250.4.0 అప్‌డేట్‌ లో ఈ ఫీచర్ మొదటిసారి కనిపించింది.. ఇందుకోసం..

ముందుగా వాట్సాప్‌ను ఓపెన్ చేయాలి. సెట్టింగ్స్‌లోకి ఎంటర్ అవ్వాలి. నోటిఫికేషన్స్‌పై క్లిక్ చేయాలి.

అప్పుడు డిజేబల్ నోటిఫికేసన్స్ ఫీచర్ మీకు అందుబాటులో ఉందో లేదో చూడండి. ఒక వేళ ఉంటే ఆ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి బీటా యూజర్లకు అప్‌డేట్ ఇచ్చారు కాబట్టి త్వరలో మిగతా యూజర్లకు కూడా అందుబాటులోకి రానుంది.. ఇకపోతే ఈ మధ్య వినియోగదారుల కోసం పర్సనలైజ్డ్ 3డీ అవతార్‌లను అందుబాటులోకి తెచ్చింది. మెటా యాజమాన్యంలోని WhatsApp రెండు బిలియన్ల కంటే ఎక్కువ మంది వినియోగదారుల తో ప్రపంచంలో ఫెమస్ అయిన ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌గా ఉంది.

ఇప్పుడు వాట్సాప్‌కు అవతార్‌లను తీసుకువస్తున్నాము. ఇప్పుడు మీరు మీ అవతార్‌ను చాట్‌లలో స్టిక్కర్‌గా ఉపయోగించవచ్చు. వినియోగదారుడి డిజిటల్ వెర్షన్. దీన్ని విభిన్నమైన హెయిర్ స్టైల్స్, దుస్తులను కలపడం ద్వారా సృష్టించవచ్చు. WhatsAppలో వినియోగదారులు ఇప్పుడు వారి పర్సనలైజ్డ్ అవతార్‌ను వారి ప్రొఫైల్ ఫోటోగా ఉపయోగించవచ్చు. అనేక విభిన్న భావోద్వేగాలు, చర్యలను ప్రతిబింబించే 36 స్టిక్కర్‌లలో ఒకదాని నుంచి మరో దాన్ని ఎంచుకోవచ్చు..ఇది మనకు కావలసిన వాళ్లకు ఆ స్టిక్కర్‌లను పంపించడం వల్ల హ్యాపీగా ఫీల్ అవుతారు..

Read more RELATED
Recommended to you

Latest news