ప్రియురాలి ఇంటికి బాబా వేషంలో.. చివరికి స్థానికుల చేతిలో..!

-

నాలుగు రోజుల క్రితం రాజస్థాన్‌లో ఓ యువకుడు ప్రియురాలిని కలిసేందుకు అమ్మాయి ఇంటికెళ్లాడు. అంతలోనే తల్లిదండ్రులు రావడంతో వారి నుంచి తప్పించుకునే క్రమంలో పారిపోతూ పాకిస్థాన్‌ బార్డర్‌లోకి వెళ్లి చిక్కుల్లో పడ్డాడు. అదే తరహా మరోఘటనలో ఓ ప్రియుడు తన ప్రేయసి బాగోగులు తెలుసుకునేందుకు బాబా వేషంలో వచ్చాడు. చివరికి అతడి వ్యహం బెడిసికొట్టి స్థానికుల అడ్డంగా దొరికిపోవడంతో చితకబాది పోలీసుకు అప్పగించారు. జాజ్‌పూర్‌ రోడ్‌ ఫెర్రో క్రోమ్‌ గేటు కాలనీలో బాబా వేషంలో ఓ వీధిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ప్రేమికుడిని పిల్లల దొంగగా భావించిన స్థానికులు పట్టుకుని ఆరా తీయడంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది.

భువనేశ్వర్‌లోని అంగుల్‌లో ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్న ఓ విద్యార్థిని, ఇతగాడు ప్రేమించాడు. ఈ విషయంలో ఆ అమ్మాయి ఇంట్లో విషయం తెలవడంతో వీరి ప్రేమను నిరాకరించి ఇరువురిని గట్టిగా హెచ్చరించారు.దీంతో కొన్ని రోజులు ఇరువురు దూరంగా ఉంటున్నారు. కుటుంబ సభ్యులు సైతం ఆ అమ్మాయిని బయటకు పంపేక్రమంలో తగు జాగ్రత్తలు తీసుకుంటు నిరంతరం ఓ కన్నెసి ఉంచుతున్నారు.

గడ్డం లాగడంతో..

తన ప్రియురాలి ఇంట్లోని తాజా పరిస్థితులను తెలుసుకుందామని శతవిధాల ప్రయత్నాలు చేస్తుండగా అన్ని బెడిసి కొట్టాయి. చివరికి ఆ ప్రేమికుడు ఆమెతో ముఖాముఖి భేటీ కావాలనుకుని వేషం మార్చి బాబాగా తయారయ్యాడు. ప్రియురాలి ఇంటి పరిసరాల్లోనే తిరుగుతండగా అనుమానం వచ్చిన కొందరు అతన్ని పట్టుకుని నిలదీశారు. తాను హిమాలయాల నుంచి వచ్చిన బాబానంటు నమ్మబలికాడు. అతను చెప్పే సమాధానాలు పొంతన లేకపోవడంతో అక్కడున్న వారిలో ఒకరూ గడ్డం పట్టి లాగడంతో అసలు వేషం బయటపడింది. దీంతో స్థానికులు ఒక్కసారిగా అతడిపై ఎగబడి చావుదెబ్బలు కొట్టి పోలీసులకు అప్పగించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version